శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
100. బ్రహ్మగ్రంధి విభేధినీ* | ||
*బ్రహ్మగ్రంధి* : మూలాధారమునకు, స్వాధిష్ఠానమునకు, మధ్య ఈ బ్రహ్మగ్రంధి వుంటుంది. ఈ బ్రహ్మగ్రంధి మాయాగ్రంధి, సృష్టిగ్రంధి, షడ్వికారగ్రంథి, సర్వసంకల్పగ్రంధి. దీనిని ఛేదించితే బ్రహ్మమునకు దారి ఏర్పడుతుంది. బ్రహ్మయుక్క కార్యం సృష్టికార్యం కనుక సృష్టికార్యమునకు సంబందించిన అవ్యవములన్ని ఆ ప్రాంతమునందే వుంటాయి. *విభేదినీ* : తనని తాను చీల్చుకొని అంశలంశలైన అఖండము సర్వసృష్టిని నిర్మించినప్పుడు మాయగా తానే ఆవరించినప్పుడు, తననితానే ప్రతిహింస చేసుకొని మరల బ్రహ్మామై లయస్థానమైన బ్రహ్మశీర్షమునకు చేరుతుంది. విభేదినీ అన్నది తాను అల్లుకున్న సాలెగూడులాంటి మాయను తానే ఉపసంహరించుకుని సహారక్రమంగా ఉన్మేయభూమికలలో తనదైన అసలు చోటునకు వెళ్లునది ఎవ్వరో,.. ఆ ముఖ్యప్రాణమునకే విభేదిని అని పేరు. మూలాధారమునుండి బయలుదేరి స్వాధిష్ఠాన సంభందమైన బ్రహ్మగ్రంధిని భేదిస్తున్న కుండలిని శక్తి రూపములో వున్న తల్లికి నమస్కారము 🙏 🌺మన బుద్ధిలో ఆవహించిన మాయారూపముగా వున్న , తాత్కాలికమైన దేహభావం, వ్యామోహం, నాది, నేను అనే భావనలు తొలగించి స్వస్వరూప జ్ఞ్యానాన్ని కలిగిస్తుంది 🌺 |