శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
59. మహాపద్మాటవీసంస్థా | ||
*హాపద* : బ్రహ్మస్వరూపిణి అని అర్ధం. "ఆకాశహవై బ్రహ్మ" అన్న కారణముచేత బ్రహ్మపదము తానే, బ్రహ్మయు తానే అని అర్ధము. *మహాటవి :* కులాకులమార్గమంతా కలిపితే మహాటవి అవుతుంది. కులమార్గాన్ని పద్మాటవీ అంటారు. ఆకులమార్గాన్ని మహాపద్మాటవీ అంటారు. ఈ రెండింటిని కలిపితే రక్తసహస్రము నుండి శ్వేతసహస్రమూ వున్న మార్గమంతా మహటవిసంజ్ఞతో తెలియబడుతుంది. మానవుని తేజేసు అతని బయట పదహారు అంగుళములవరకు వ్యాపించి వుంటుంది. ఇంకా మహితాతమైన వారి తేజేసు ఇంకా ఎక్కువ దూరం వ్యాపించి వుంటుంది.. కాబట్టి ఆ తల్లీ యుక్క మార్గము రక్తసాహస్రమునుండి బ్రహ్మశీర్ష పర్యంతమూ వుంటుంది అని తెలుసుకోవాలి. త్రికోణాంతర దీపికయే ఈ మహాపద్మాటవిసంస్థా. శ్రీమన్నగర వర్ణనలో చివరినున్న శృంగార ప్రకారమునకు చింతామణి గృహ్ణమునకు మధ్యనున్న సువర్ణపద్మాటవీయే మహాపద్మాటవీసంస్థా . అమ్మవారి పంచబ్రహ్మాసన చుట్టూ, మహాపద్మాటవీసంస్థా అన్న వనం ఏర్పడింది. ఆ మహాపద్మాటవి లో జగన్మాత కూర్చునివున్నది. ఆ తల్లికి నమస్కారము 🙏 ఈ వనంలో పద్మములు సన్నగా పొడుగుగా వున్న కాడ పై వేయి రేకలతో వికసిస్తాయి. వీటిని స్థలపద్మము అని అంటారు. ఇది మన శరీరం,👇సహస్త్రర చక్రంలో ఉన్న సహస్రదళపద్మమే 'మహాపద్మాటవీసంస్థా'.ఇక్కడ అమ్మవారు కూర్చున్నది🙏 🌺మన శరీరములో అన్ని అంగాలలో శక్తి ప్రవహిస్తూ, అన్ని శక్తులకి పైన ఒక శుద్ధశక్తి స్థిరంగా ఉండి మనని నడిపిస్తోంది అన్న జ్ఞానం కలుగుతుంది 🌺 |