శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
28. మందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసా | ||
*మందస్మిత* : అనగా బిందు వికాసము. *స్మితప్రభా* : రక్తబిందువుయుక్క వెలుగు స్మిత ప్రభా. *మజ్జత్కామ* : ఈశ్వరుని యుక్క సంకల్పసమే తనదైన స్వరూపముగా వున్నా రక్తబిందువు. *కామేష్ స్మిత:* కామేశ్వరుని యుక్క సంకల్పమే అమ్మవారి యుక్క నవ్వు. కామేశ్వరుని యుక్క శ్వాసయే జగన్మాతయుక్క సూక్ష్మాతిసూక్ష్మా స్వరూపము లేదా పరాస్వరూపము . కామేశ స్మిత అంటే కామేశ్వరుని చూడటంచేత ఆనందము పొంది చిరునవ్వు బలికించునప్పటిది అని అర్ధం. ఆ జగన్మాత ని వీక్షిస్తూ కామేశ్వరుడు కూడా స్మితవదనుడు అయ్యాడు. అనగా వీరిఇద్దరి భావములు ఎల్లపుడు ఒకటిగానే ఉంటాయి. వారు ఇద్దరు ఒక్కటే ఆలోచన చేస్తారు. ఆ భావమే సృష్టి యుక్క రహస్యం అని తెలుసుకోవాలి. తన చిరునవ్వు కాంతితో కామేశ్వరుడి మనస్సు ను లయింపజేస్తున్నా తల్లికి నమస్కారము 🙏. 🌺 *ఈ నామం వల్ల మనలో కలిగే* *మానసిక పరివర్తనము. 🌺* చిరునవ్వు తో సాధించలేనిది ఏదీ లేదు అన్న విషయాన్ని గ్రహింపునకు వచ్చి మన తోటివారితో సంబంధాలలో మృదుత్వాన్ని, మన ఉనికి యుక్క విలువను పెంచుకోగలుగుతాము. 🙏 |