శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
89. మూలకూటత్రయ కళేబర | ||
*మూలత్రయ* : మూలత్రయ అంటే శ్రీచక్ర అంతర త్రికోణం, బిందు -స్పంద -ప్రతిస్పందములు, సత్వ -రజో -తమోగుణములు, బ్రహ్మా -విష్ణు -మహేశ్వరులు, ధ్యాన-ధ్యాతృ -ధేయములు. అంటే సర్వ త్రిపుటియే మూలమంత్రము. ఆ మూలమంత్ర స్వరూపమే అమ్మవారు. *కూటత్రయ* : పంచదశీ యందు మూడు కూటములు వుంటాయి. ఆ మూడు కూటములు హ్రoకారమునందు పర్యవసిస్తాయి. *మూలకూటత్రయ* : పంచదశి మంత్రాక్షర స్వరూపిణి. స్థూల, సూక్ష్మ, కారణ శరీరములో కూటత్రయ కళేబరము. మూలకూటత్రయము అనగా బ్రహ్మగ్రంధి, విష్ణుగ్రంధి, రుద్రగ్రంధి . మూలాధారము దగ్గర వున్న కుండలినియే మూలకూటత్రయ కళేబర. 🌺బీజాక్షరాలను మననం చేయడం వలన పెంచుకున్న ప్రాణశక్తి మన నాడీమండలమంతా ప్రవహిస్తూ, శిరస్సు నుండి పదాలువరకు గల మూడు విభాగాలతో కూడిన సమస్త శరీరానికి శక్తిని అందిస్తుంది.🌺 |