శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
60. కదంబవనవాసినీ | ||
సర్వసముదాయములే 84 లక్షల జీవకోటి సముదాయములు. చైతన్య జీవులన్నింటికీ ఆమె మాత కాబట్టి ఆమె కదంబ. ఎల్లపుడు పుట్టినవారిని బ్రతికించడమే కాకుండా, కొత్తపుట్టుకలకు కూడా కారణభూత ఆవు తుంది. శ్రీచక్రములో నవావరణ సముదాయము మధ్యవున్న త్రికోణ బిందుమండల పీఠంలో బిందుమండలవాసినిగా వున్నది అని కూడా అంతరార్ధం. *వన* : వనము అంటే తోట, అరణ్యము. పెద్ద తోటనే అరణ్యము అంటాము. అయితే ఇక్కడ వన శబ్దంచేత పరాకాశము నుండి ఈశ్వరుని నిశ్వాసము బయలుదేరినప్పుడు ఒక పెద్ద సముద్రపు గాలి హోరు వలే ఆ నిష్వాసము వచ్చింది. అందులోనుండే సర్వప్రాణికోటికి ప్రాణము వచ్చింది. అంటే ఉదానవాయువు కూడా అందులో నుండే వచ్చింది. దానినే వనము అంటాము . వన శబ్దము తో నీరు అని కూడా అర్ధము వస్తుంది. సమస్త ప్రాణులను వాయువుచే స్తంభించి, మరల వాటికి నీరు తో ప్రాణము పొసే శక్తి గల తల్లీ అని అర్ధము. ఈ సమస్త జీవరాశులని ఆకర్షింప జేయ శక్తి కదంబ వృక్షానికి వున్నది. ఇంతక ముందు వున్న నామం,,.. మహా పద్మాటవీసంస్థా చుట్టూ ఈ కదంబ వనము వున్నది. అటువంటి దేవతా వృక్షాన్ని ఆచ్చాదనగా పెట్టుకున్న తల్లికి నమస్కారము 🙏 🌺ఈ నామంవల్ల మనలో కదంబ వృక్షం వంటి చైతన్య స్వభావం మనకి ప్రసాదించాలని ఆ జగన్మాత ను వేడుకుందాము🌺 🙏 |