శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
26. కర్పూరవితికామోదసమాకర్షిద్ధిగంతరా | ||
ఇందులోని కొన్ని గుప్త నామాలు. *మోద* : అంటే హర్షం. మనకు ప్రియాతిప్రియమైన చోట, ఇష్టమైన వాక్కు నందు, ఇష్టమైన వస్తువునందు, ఇష్టమైన జీవి యందు లేదా మన ఇష్టం తీరినపుడు కలిగేది హర్షము లేదా మోదము. *సమాకర్షిత్* : అంటే పరస్పర వీక్షణము. ఆ జగన్మాత పితరులు యుక్క పరస్పర ప్రేమ మరియు ఆకర్షణ వల్లనే అఖండము కాండమై ప్రపంచోల్లాసము జరిగి నామరూప వికారాత్మక సృష్టి జనించింది. *దిగంతర* : దిక అంతర అంటే శ్రీచక్రమునందు చతుర్ద్వారములు దగ్గర నుండి మొదలుపెట్టి చుస్తే అష్టకోణచక్రం బిందువుకు త్రికోణ మునుకు తరువాత వున్నది కాబట్టి, దిగంతర్ అయినది. శ్రీచక్రముయుక్క చతుర్ద్వారములు నాలుగు దిక్కులు అనుకుంటే పైన వున్నది తూర్పు, కుడివైపున దక్షిణము, ఎడమవైపు ఉత్తరము, క్రింద పడమర అయినట్లయితే దీనియుక్క అంతరము అష్టకోణ చక్రము నందు వున్నది. అది ఇక్కడ రహస్యం. *కర్పూరవీటిక* : విటికా అంటే తాంబూలం. కర్పూరవీటిక అంటే కర్పూరాది 21 వస్తువులను అందులో చేర్చి అమ్మవారికి తాంబూలము సమర్పించడం. కర్పూరవీటిక అంటే సుగంధ ద్రవ్యములతో కూడిన తాంబూలము అని అర్ధం. కర్పూరం రంగు తెల్ల గా ఉంటుంది.. అంటే స్వచ్ శ్వేతము. అంటే అది శుక్ల బిందువు అని గ్రహించాలి. వీటిక అంటే తాంబూలం, నమలటంచేత ఎర్రగా అవుతుంది. ఈ ఎరుపు రంగునీ రక్త బిందువు అని గ్రహించాలి. అందుచేత కర్పూర వీటిక అంటే రక్తబిందువు శుక్లాబిందువు అని అర్ధం. ఇది సారాంశం. కర్పూరాది సుగంధచూర్ణంతో మిశ్రీతమైన తాంబూలాన్ని సేవించినందున, ఎర్రబడిన ముఖం పరిమళంతో దిగంతాలను అరికర్షిస్తున్న తల్లి కి నమస్కారము. 🙏 🌺ఈ *నామం వల్ల మనలో కలిగే* *మానసిక పరివర్తనము* 🌺 శుభతత్వం, దృడత్వంతో, శుభపరిమళాలతో కూడిన వాతావరణం ఏర్పడుతుంది. |