*భండ* : భండము అంటే ఇంద్రియగ్రామము. అనగా కర్మేంద్రియ పంచకము, జ్ఞానేంద్రియ పంచకము, తన్మాత్ర పంచకము. వీటితో పాటు పంచప్రాణములు, పంచ ఉపప్రాణములు - ఇవన్నియు కలిసి భండ.
*అసుర వధ* : ఈ ఇంద్రియములన్ని కలిపి ప్రాణశక్తి చేత జీవిస్తున్నాయి, అసువులచేత జీవిస్తున్నాయి. అసువులయందే రమిస్తున్నాయి. వచ్చే - పోయే శ్వాసతో అని అర్ధం.
ఐతే పంచభూతాత్మకంగా నామరూపాలను మాత్రమే నిలిపి శ్వాసబంధమునకు దారి తీస్తుంది.
ఆందులో వున్న ఉదానవాయువును బ్రహ్మా ముఖముగా మరల్చటమే అసుర వధ.
*సేనా* : 72 వెల స్నాయుసముదాయములు ఈ భండాసురుడునే ఇంద్రియగ్రామమునకు సేన. వీటియుక్క ప్రకోపము చేత, రక్తప్రసారము చేత మానవునికి జీవచాపల్యా లక్షణాలు కలుగుతాయి.
*శక్తి సేన :* కుండలినిని జాగృతం చేయటానికి ప్రాణాన్ని కుంభకంచేసి, శక్తి జాగ్రుతంచేసి బ్రహ్మశీర్షము వైపునకు దానిని తీసుకొనివెళ్ళుట. దీనిలో ఇడ, పింగళ అనేవి కూడా వున్నాయి. ఇవన్నీ కలిపితే శక్తిసేన అవుతుంది.
భండము అంటే ఇంద్రియగ్రామము అను చెప్పుకున్నాము కదా,... అందులో అసురులు రమించునవి.
లౌకికంగా ఆలోచన చేస్తే, భండ అనే మన శరీరములలో అసురులు అంటే చాంచల్య లక్షణాన్ని,
వధోద్యుక్త అంటే మన శరీరములో వుండే చాంచల్య స్వభావాన్ని నాశనం చేయుట.
అన్ని కళలతో కూడిన సేన కి శక్తి ని ఇచ్చే తల్లీ.
శక్తి సేన కళలు అన్ని కుడి సమన్వితమై మనలో వుండే చాంచల్య స్వభావాన్ని సంహరిస్తాయి.
ఈ సంహారము లేక విజయము అన్ని శక్తి సేనలు ఏకత్వము వహించి చేస్తేనే అవుతుంది.
క్రూరుడైన భండాసురుణ్ణి సంహరించడానికి తన శక్తి సేనతో సిద్ధముగా ఉన్న తల్లీ కి నమస్కారము🙏
🌺మనలో వుండే అజ్ఞానం, అసుర స్వభావాన్ని, బలహీనతను అనే భండాసురుణ్ణి, ఆత్మయనే లలితాంబిక, తన శక్తిసేనలతో కుడి సంహారము చేస్తుంది.
ఈ స్వభావము తొలగించుకోడానికి అమ్మ ని ప్రాధేయ పడాలి, అమ్మ మెప్పు పొందాలి.
అంటే అహర్నిశలు అమ్మ నామావళిని జపిస్తూ ఉండాలి. 🌺🙏
|