శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
95. కులయోగినీ | ||
కులాకులమార్గములో శ్వేతసహస్రారములో సదాశివుని తేజాస్సుతో కలిసిపోవాలని ప్రయాణించే ముఖ్యప్రాణమే కులయోగిని. శ్రీచక్రపరంగా నవావరణ దేవతలు కూడా యోగినిలు అనే పేరు వుంది. చంద్ర చంద్రికలవలె వారు జగన్మాత యుక్క అభిన్నాశ స్వరూపులు. షోడశీదల పద్మంలోనివారు గుప్తయోగినులు. అష్టదళంలో గుప్తతరయోగినులు. అంతర్దశారంలో నిగర్భయోగినులు. వసుకోణంలో రహస్యయోగినులు. త్రికోణచక్రంలో అతిరహస్యయోగినులు. సర్వానందమయ మండలంలో పరాపర రహస్యయోగినులు. వారు జగన్మాత కంటే భిన్నులు కారు. వారిలో వున్న అమ్మవారికి నమస్కారము 🙏 🌺మొదట పదార్థం గురించి తెలుసుకొని క్రమంగా పరమార్ధం కొసం అన్వేషణ మొదలు పెడతాము. ఈ అంవేక్షణకు అవసరమైన ఏకాగ్రతను, నిశ్చలత్వాన్ని సంపాదించుకునే విధానమే యోగము. ఈ యోగములో ఒకసారి ప్రవేశించగలిగేతే నిరంతరమూ దానిని ఇష్ట పడుతాము 🌺 |