శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
6. ఉద్యద్భానుసహస్రాభా | ||
ఇందులో కొన్ని గుప్తనామాలు *సహస్రాభ :* ఆ కాంతి సహస్ర ముఖములా వ్యాపించి సృష్టిని చేసినది భానుసహస్రాభ : వేయి సూర్యుల కాంతికంటే మిన్నయైన కాంతి. ఆ కాంతి కాంతికే కాంతి , కనుక భాను సహస్ర అయినది . *ఉద్యత్ భాణుసహస్రబ్* : దేవకార్యసముద్యతయైన పరమేశ్వరి మహా మాయయై పరిణమించి వేయి సూర్యుల ప్రకాశంతో సృష్టి కార్యమునకు నాంది పలికింది . *భా సహస్ర* : భా సహా అస్రము అంటే శ్రీ చక్రము అని అర్ధం. *ఉద్యత్ భా :* అపుడే ఉదయించిన కాంతి అనగా , అంతకు పూర్వము కాంతి ఎదో , అంతటా వ్యాపించివున్నది ఏదో ఎరుగని అనంత అద్వయ (రెండోది లేదు )అఖండ(ఖండం కానిది ) పరవిశేషము (భగవంతుని లీల ) *బాను భాసహస్ర* : విశ్వగర్భంలో దాగివున్న రూపంలేని సృష్టికి కర్మ పరిపాకమైనప్పుడు (పూర్తిగా అధర్మం వ్యాపించి ) , మరల నామరూపాత్మక జగత్తును సృష్టించవలసిన క్షణము ఆసన్నమైనప్పుడు పుట్టిన బిందువు యుక్కా కాంతియే భాను భాసహస్రరం ఈ సమస్త కోటి బ్రహ్మాండములన్ని ఆ కాంతి యుక్కా పరివర్తనము , ప్రతిఫలనము పరిణామము పరిభ్రమము ఇద్యాది కార్య సామాగ్రిచేత సమకూడినదే కాబట్టి ఈ జగత్తు అంత అమ్మవారి యుక్కా కాంతి సభా . నామరూప వికాస్ జగత్తు అంత ఆమె కాంతియుక్క నీడగా , ఆ కాంతియుక్క ప్రకాశముగా భావించవలె . ఉద్యద్భానుసహస్రాభ నమముచేత శుక్ల రక్త బిందువుల యుక్కా సంయోగము వలన మూడవదైన కృష్ణబిందువు లేక సూర్యబిందువు ఉత్పత్తి జరిగింది . అనగా బిందువు స్పందించి ప్రతిస్పందించి త్రిపుటిగా మారి బిందు త్రికోణము అవటమే ఉద్యభానుసహస్రాబయందలి అంతరార్ధం . ఉదయించుచున్న వేయి సూర్యుల కాంతిని బోలు తల్లికి నమస్కారం 🙏 🌺 *ఈ నామం వల్ల మనలో కలిగే* *మానసిక పరివర్తనం* 🌺 సత్కార్యాలను చేయడానికి జనించిన చైతన్య జ్యోతి మనలో అజ్ఞానము , అవివేకము అనే చీకట్లను తొలిగిస్తుంది . అ వెలుగు మన జీవితానై కాక మన చుట్టూ ఉన్నవారి జీవితాన్ని కూడా కాంతివంతం చేస్తుంది 🙏 |