శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
54. స్వాధీనవల్లభా | ||
*వల్లభ* : ఈశ్వరుడు, వల్లభుని కలిగి వుండటము. *స్వాధీన :* తన అధీనములో ఈశ్వరుడు వున్న పరాశక్తి స్వరూపము. అనంత మహాసాగరంలో తెలియాడుచున్న కాంతినౌక ఆమెయే. ఆ సాగరము ఆమెయే. ఆ నౌకరూపము ఆమెయే.. అంతా ఆమె స్వాధీనమే. సర్వ ప్రజ్ఞా స్వసరూపిణి, సర్వ ఇచ్చా స్వరూపిణి. రక్తబిందువు శుక్లాబిందువునకు స్వాధిష్ఠానము,. పరాకృతిలో శుక్లబిందువు ఈశ్వర ప్రతిబింబమై రక్తబిందువునకు స్వాధీనమైనది. పరస్పర వల్లభ లీలావిలాసం. ఇక్కడ ఎవరికి ఎవరూ స్వాధీనము కాదు. ఇది పరాపర లక్షణ బ్రహ్మవిద్యాస్వరూపము. అపరా లో ఆత్మ దాగివున్నది, పరాలో పరమాత్మ దాగివున్నది. ఆత్మ అప్పుడు స్వాధీన వల్లభ అగును. 🙏 🌺 ఈ నామంవల్ల, మన ఆత్మ ను ప్రక్షాళన చేసుకొని, మంగళప్రదమైన వాటిని స్వాధీనము చేసుకోగలిగే నైపుణ్యం కలుగుతుంది 🌺🙏 |