*శుద్ధవిద్య* : శ్రీచక్ర మధ్యాయతర్గత విద్యలో శుద్ధ విద్య చాలా గొప్ప విద్య . ఇది సదాశివునిచేత వ్యాపితమైనది.
*అంకురాకార* : శ్రీచక్ర మధ్య బిందువే అంకురాకారం కలది .
*ద్విజపంక్తి* : ద్విజములు అంటే దంతపంక్తి . కేవలం దంతములనే భావించకుండా , నాదముగ భావించుకొని , పశ్యన్తి , మధ్యమ , వైఖరిగా పలకడం దాని యుక్క వ్యక్తరూపం .అమ్మవారు నాదస్వరూపిణి కాబట్టి అమ్మవారి దంతములన్ని ఈ నాదముయుక్క , మాతృకావర్ణములు యుక్క విశిష్టతని , రహస్యాన్ని తెలుపుతాయి .
విజయోజ్జ్వలా : విజయ ఉజ్వల . జయ అంటే 18 సంఖ్యా .విజయ అంటే , జయ లో 18 ని 1+8 = 9 అవుతుంది . విజయ అంటే 9 ప్రణవము దానిచేత ఉజ్వలమైనది . అంటే ప్రణవ యుక్క కాంతియే సర్వ ఆకాశములను స్టూష్టించింది . ఆ ప్రణవ్ స్వరూపమే అమ్మవారు అని దీని వలన తెలుసుకోవాలి .
*శుద్ధవిద్య౦కురాకారా* : మాతృక వర్ణములో అ, ఇ, ఉ , ఋ , ఌ, క ఖ గ ఘ ఙ , చ ఛ జ ఝా ఞ, ట ఠ డ ఢ ణ , త థ ద ధ న , ప ఫ బ భ మ, స హ.
ఈ 32 శుద్ధ విద్య౦కురాలు , మాతృకబీజములు , మాతృక వర్ణములు అని తెలుసుకోవాలి .
శ్రీ విద్య యందున్న పదహారు జంట వర్ణరూపాలు వలే ప్రకాశిస్తున్న దంతపంక్తుల గల తల్లి కి నమస్కారము 🙏.
🌺 *ఈ నామం వల్ల మనలో కలిగే* *మానసిక పరివర్తనములు 🌺*
సృష్టిలో వ్యక్తం చేయడానికి అనువైన మార్గం వాక్కు. అక్షరాలను స్పష్టంగా పలకటానికి దోహదం చేసే శక్తులు దంతాలు. స్పష్టతతో కూడిన వాక్కు మనలో ప్రభావితం అవుతుంది. 🙏
|