శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
67. అశ్వరూఢాదిష్ఠితాశ్వకోటి కోటిభిరావృతా | ||
*అశ్వా* : అశ్వము అని సామాన్య అర్ధము. " ఇంద్రియాణి హాయాని ఆహు ". అంటే జీవియుక్క ఇంద్రియములే అతని శరీరరధమును లాగునట్టి గుఱ్ఱములు. ఆ గుఱ్ఱముల సంకల్పము సరిగా లేనిచో వీటి దారిన అవి పోతాయి. బ్రహ్మాదారికి మరలవు. *అధిష్ఠిత* : సర్వభ్రహ్మాండమును సింహాసనముగా కలిగిన తల్లీ. *కోటి కోటి* : మన శరీరములో వున్న నాడి ఇడ, పింగళ, సుషుమ్న అన్నవి ఒక కోటి. మరల రెండో కోటి సుషుమ్నాయందే వున్న వజ్రిణీ చిత్రిణీ, బ్రహ్మణి. ఈ నామంలో ఐదు అకారములు వున్నవి **అ* శ్వారూఢ దెగర ఒక అకారము *అ* ధిష్టిత దెగర ఒక అకారము *అ* శ్వకోటి దెగర ఒక అకారము *ఆ* వృత దెగర ఒక అకారము త్ + *ఆ* =తా లో చివరి ఆకారము ఈ ఐదు 'అ' కారములు శ్రీవిద్య మంత్రముయుక్క రహస్యాన్ని తెలుపుతాయి. జగదాంబయుక్క పాశాయుధమునుండి ఉద్భవించినది శక్తిసేన, ఆమె పేరు అశ్వారూఢ. ఆమె అశ్వము పేరు అపరాజిత. అశ్వారూఢ అన్న దేవత జగన్మాత యుక్క అశ్వములన్నిటికి అధిదేవత. అ అశ్వములు దారి తప్పకుండా తన పాశముతో వాటిని నియంత్రిస్తుంది. అశ్వారూఢ అన్న దేవతచే నియంత్రించినబడిన తన అశ్వముల సముదాయముతో వున్న తల్లికి నమస్కారము 🙏 🌺మన ఇంద్రియములే అశ్వకోటి. కోటి కోటి అనుటచే కర్మేంద్రయ -జ్ఞానేంద్రియ సముదాయములు. ఇంద్రియాలు కోరికలు కోరుతూ గుఱ్ఱంవలే వేగంగా పరుగెడతాయి. అ కోరికలు సన్మార్గము లో వున్నావా లేదా??, అవి దుర్మార్గం వైపు దారి తప్పకుండా, అమ్మవారు పాశం తో మన మనస్సును నియంత్రిస్తుంది🌺🙏 |