శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
24. నవవిద్రుమబింబశ్రీ న్యక్కారిరదనచ్ఛదా | ||
*బింబశ్రీ* : ఎర్రటి దొండపండు రంగు కలది .ఈ గుప్త నామాన్ని లూతుగా విశ్లేషణ చేస్తే , రక్తబిందువు (శక్తి బిందువు) , శుక్ల బిందువైన ఈశ్వరునియుక్క బింబము ప్రతిఫలమే ఈ సమస్త సృష్టికి మూలకారణం మైనది . రక్తబిందువు ఈశ్వరుని ప్రతిబింబమే బింబశ్రీ . *నవవిద్రుమ* : కొత్తదైనా పగడపు కాంతులచేత ప్రకాశించునట్టిది . *రదనచ్ఛదా* : అమ్మవారి రెండు అధరముల నాదమూయుక్క స్పందరూపమునకు గుర్తులు. అంతేకాక ఆ పెదవులకు వెనుకవున్న వదనంలో , జిహ్వలో 32 మాత్రేమే కాదు 48 మాతృకావర్ణములు ఆమె దంత పంక్తులని చెప్పారు . క్రొత్తపగడం ,ఎర్రటి దొండపందు కాంతిని మించి ప్రకాశించే ఎర్రటి అదరములు (పెదవులు) గల తల్లికి నమస్కారము🙏. 🌺 *ఈ నామం వల్ల మనలో కలిగే* *మానసిక పరివర్తనం* 🌺 తీయటి పలుకులు , ధర్మ వాక్కు పలకగలిగే దివ్యత్వాన్ని ప్రసాధిస్తుంది .నోటికి తలుపులు వంటివి ఈ పెదవులు . " సత్యం భృయాత్ ప్రియం భృయాన , న బృయత్ సత్య మప్రియం .ప్రియం చ నానృతం భృయాత్ , ఏష ధర్మ సనాతనః " *సత్యమునే పలుకుము, అది కూడా, వినేవారికి ప్రియముగా పలుకుము. సత్యమే అయినా ఇతరులకు బాధ/హాని కలిగించే విధముగా మాట్లాడవద్దు. ప్రియముగా ఉన్నా సరే ఎప్పుడూ కూడా అసత్యము పలకవద్దు. ఇదే మన సనాతన నీతి మరియు ధర్మ మార్గము.*🙏 |