శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
55. సుమేరు మధ్యశృఙ్గస్థా | ||
*సుమేరు* : జగన్మాతయుక్క శ్రీనగరము శృంగమునందే వున్నది. దానినే సుమేరు అంటారు. అదే బిందువు స్థానము. *శృంగ* : అంటే శిఖరము. ఆ శిఖరమే బిందువు. సుమేరు బిందు మండలము. శృంగ అంటే కోణములు, మూలలు, దిక్కులు అని కూడా అర్ధం. శ్రీచక్ర బిందువే సుమేరు. ఇందులో త్రికోణం లో తూర్పు కోణం బ్రహ్మ. అది ఇచ్చాశక్తి. నైరుతి కోణం విష్ణువు అది జ్ఞానశక్తి. వాయువ్య కోణం రుద్రుడు. అది క్రియాశక్తి. బిందువు మెరుప్రస్థానములో త్రికోణ శిఖరములకు శిఖరమైనది. మకార, అకార, ఇకార, రకార, ఉకారములు కలిపితే మేరు అయినది. ఇకార మధ్య శృంగము. అదియే బిందుస్థానము. "ఆ, ఇ, ఉ" లు లోక తారా మండలము. 'ఈo' అన్నది పరానాదము. అదియే కామకళా స్వరూపము. అదియే బిందుమండల వాసిని. మాతృకామాలా మహేశ్వరస్వరూపమే ఈ సుమేరు మధ్యశృఙ్గస్థా. మేరు శిఖరాల మధ్యలో వసించు తల్లికి నమస్కారము. 🙏 🌺అన్ని దిక్కులు ఆ అమ్మవారివే. ఏ దిక్కు తెలియని వారికీ ఆ దేవుడే దిక్కు అన్నట్టు, ఆ పరా శక్తియే దారి చూపిస్తుంది. మన చేయవలసింది ఒక్కటే, హృదయము నిండా, మేరు శిఖరము వలే అచంచలమైన విశ్వాసం, ఆ జగన్మాత యందు వుండవలే. 🌺🙏 |