శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
90. కుళామృతైకరసిక | ||
*కుళామృతము* : రెండు సహస్రారముల మధ్య వున్న తేజసే కులామృతము. *ఎకరసికా* : ఆ అమృతమును సుషుమ్నస్వరూపిణియై ఆస్వాదడించటమే 'ఎకరాసిక ' లక్షణం. *అమృతైకరసిక* : "పృధివ్యాపస్తేజో వాయురాకాశాత్ " అనే భూతాంశములను వదిలి సుషుమ్న ఆ తేజస్సును మాత్రమే ఉన్మేయభూమిలలో ఆస్వాదిస్తూ వెళ్తుంది. సహస్రారం పురపద్మం. అది అధోముఖముగా వుంటుంది. ముఖ్యప్రాణమైన సుషుమ్ననాడి రక్త శుక్ల సహస్రారం మధ్య ఏకపదం గా నడుస్తుంది. సహస్రారం నుండి ప్రసరించే కాంతియే కులామృతం. దానిని సేవించేది కుండలిని. అదియే ఎకరసిక. సిక, సిర అన్నవి రహోయాగములో ఆరోహణ - అవరోహణ భూమికలను తెలిపే సుషుమ్నామార్గం. 'ర సి క లో సిక, సిర అని రెండు వున్నవి. ఒకటి అమృతతత్వాన్ని ప్రసాదిస్తుంది. రెండవది మృతతత్వాన్ని ప్రసాదిస్తుంది. కులామృతైక రసిక అంటే అమ్మవారియుక్క బ్రహ్మస్వరూపము, మాయాస్వరూపము. బ్రహ్మస్వరూపమే అమృతస్వరూపము, మాయాస్వరూపమే మృతతత్వస్వరూపము. మూలాధార చక్రం నుండి జాగృతమైన కుండలిని శక్తి సుషుమ్న మార్గము నుండి పయనించి షట్చక్రాలను, బ్రహ్మ , విష్ణు, రుద్రగ్రంధాలను భేదించి బ్రహ్మరంద్రనికి చేరి అక్కడ స్రవింపచేసే అమృతమును 'కుళామృతము' అని అర్ధం. 🌺మనకు కలిగే వివేకం, జ్ఞానం, ప్రాణశక్తి కలిసి అమృతధారలను స్రవిస్తాయి. ఆ అమృతమే మనకు ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. తృప్తిని, ధైర్యాన్ని, పట్టుదలను పెంచుతుంది. వైజ్ఞ్యానికంగా ఈ నామము జపించిన వలన కొన్నిరకాల ద్రవాలు జనించి మన శరీరానికి అందుతాయి. దాని వల్లనా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. covid వంటి వ్యాధినీ ఎదురుకునే immunity booster. అందుకనే నిత్యం లలితా నామ పారాయణం చేస్తే, మన జోలికి ఏ వ్యాధి రాదు. 🙏🌺. |