శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
23. పద్మరాగశిలాదర్శ పరిభావికపోలభు: | ||
*పద్మరాగ* : పద్మరాగము అంటే మాణిక్యం , ఎర్రని తేజాస్సు అని .మానవశరీరమందున్న చక్రముల కాంతి కూడా ఇట్టి కాంతితోనే వుంటుంది . *శీలా దర్శా* : శీలగా దర్శనం ఇస్తుంది . ఇక్కడ శీల పార్వతిగా భావిస్తే ఆజ్ఞాచక్రం లో పర్వత ఆకృతిలో కనిపించే విరాట స్వరూపం . *పరిభావి* : ప్రభవించు అని అర్ధం. ఆమెకి సంబందించిందేదైనప్పటికీ ఆమె ,.. అనుపమానముగా(uncomparable) వుంటుంది . *కపోలభు:* కాంతియే ఆమె యుక్క చేకుటద్దములని తెలుసుకోవాలి . ప్రభవించు లక్షణనాన్ని తెచ్చుకున్నది కాబట్టి ఆమె కపోలభు . పద్మరాగ శిలలను , అద్దాన్ని తిరస్కరించే ఎర్రటి చెక్కిళ్ళ గల తల్లికి నమస్కారము 🙏 మనలో కలిగే భావములు , సుఖఃమైనా, దుఖఃమైనా స్పష్టత ముఖంలో చెక్కిళ్ళ ద్వారా తెలుస్తుంది . మన చెక్కిళ్ళ ఎర్రబడతాయి . సవ్యమైన ఆలోచనలు , నిర్భయంగా వున్నా మనస్సు ముఖంలో తేజాస్సును ప్రసరిస్తాయి . మన ముఖం అద్దంలా ఉంటుంది .ముఖం లో పెద్ద భాగం చెక్కిళ్ళ అయినందువల్ల స్పష్టతను అందులో చూడగలుగుతాము . 🌺 *ఈ* *నామం వల్ల మనలో కలిగే* *మానసిక పరివర్తనము* .🌺 మన భావాలలో స్పష్టత కలిగి , అమ్మవారు మన భావాలూ సరైనదా కదా అని మన మనస్సుకు చెప్తూంది. దాని వల్ల మనకు మనోధైర్యం కలుగుతుంది .🙏 |