*జ్వాలామాలినికా :* స్వాధిష్టానమునందున అగ్ని స్వరూపమే జ్వాలామాలినికా. ఆ తల్లీ జ్వాలామాలిని అంటే బిందు, స్పంద, ప్రతిస్పందములతో తన తేజేసును జగత్ ప్రాణముగా చేసి, మనయందు నామరూపములను, సప్తధాతుమయముగా, పంచభూతముగా సృష్టిస్తున్నది.
*క్షిప్త* : సర్వమునూ రచించి చున్నది.
*వహ్నిప్రాకారా* : హ్రీ0 అన్నదే వహ్నిప్రాకారము. అదియే మూలాధారము దెగరవున్నది. మూలాధారము దెగర వున్న స్వాధిష్ఠానమే అగ్ని ప్రకారము.
*మధ్యగా* : చితాగ్ని కుండ మధ్యలో వున్న తల్లీ. గాయత్రీ స్వరూపము.
ఈ నామములో మూడు 'క'లు వున్నాయి. ఇవి అగ్నికుటము, సోమకుటము, చంద్రకూటము. దీనిని 'క త్రయం ' అని అంటారు. ఒక 'క 'అగ్నికి, రెండవ 'క 'సూర్యునికి, మూడవ 'క 'చంద్రుడికి గుర్తు.
ఇవన్నీయూ కలిపి అమ్మవారు వహ్ని జ్వాలా అయినది. అనగా గాయత్రీకి అగ్ని,, సూర్య, చంద్ర నేత్రాలు.
త్రిపుటి, త్రినేత్రి.
జ్వాలామాలిని అనే దేవతచే నిర్మించబడిన అగ్నిప్రకారం మధ్యలో వసించే తల్లికి నమస్కారము 🙏.
🌺ఈ నామ స్మరణ వల్ల, మన చుట్టూ ఏ ఇతర దుష్టశక్తులూ ప్రవేశించలేని రక్షా కవచం వంటి, అగ్నికవచం నిర్మించబడుతుంది.
అంతేకాక అగ్నిగుండం మధ్యలో నిలబెట్టినప్పటికీ స్థిరత్వాన్ని, పట్టుదలను కోల్పోని గుండె ధైర్యం వస్తుంది🌺🙏.
|