*కర* : అంటే కిరణము అని ఒక అర్ధము, బాహువు లేదా చెయ్యి మరొక అర్ధం.
*అంగుళి* : ఈ కిరణములు మళ్లీ ఉపకీరణములుగా వెళ్ళటం అంగుళి. లేదా చేతి యుక్క వేళ్ళు
*నఖోత్పన్న* : ఆ చేతి గోళ్ళ నుండి పుట్టిన అని అర్ధము. నఖోత్పన్నమైన కాంతినుండియే.
*నారాయణ* : సృష్టి యుక్క మార్గము ఏర్పడింది. అమ్మవారిచేతిగోళ్ళయుక్క కాంతిచేతనే సమస్త సృష్టి ఏర్పడితే అమ్మవారి ఉపాస్యమైన సమస్త శరీరము ఎంత మహిమాన్వితం మైనదో చెప్పవలసిందేమివున్నది.
*దశాకృతి* : పది అవతారములయుక్క ఆకృతి. సృష్టి పరిణామమునకు ఆ కాంతి దారి తీసింది.
ఈ సమస్త సృష్టి అమ్మవారి చేతి గోళ్ళ యుక్క కాంతులనుండి వెలువడినప్పడు అవన్నియు మరల ఆమె పాదపీఠిక దెగ్గర నమస్కరించటం సహజమే. దశాకృతులు అనగా జాగ్రత్త, స్వప్న, తురీయ, తురీయతీతములనే జీవకృత్యములు. ఈ పది కలిసి దశాకృతులు కులమార్గములో.
అట్లే సృష్టి, స్థితి, లయ, తిరోధాన, వమనములే ఐదు కృత్యములు బయటి జగత్తులో, వాటికి ఆరూఢమైన పృథ్వి అపస్తేజోవాయురాకాశములు బహిర్వసృష్టిలో.
పిండాండమందు చైతన్య కామవృతిని పుట్టించు పంచకర్మేంద్రియములు ఆ కాంతులు. నారాయణదశా అంటే ఆజ్ఞాచక్రములో ఆత్మ దర్శనము చేయుట.
ఓషధులు, అన్నము, పురుషుడు, జడచేతనములు ఇది ప్రకృతి. 'కృతి ' అన్నదానికి 'ప్ర ' అన్న ఉపసర్గ చేరిస్తే అమ్మవారు ప్రకృతిస్వరూపిణి అన్నది రహస్యం. ఈ బ్రహ్మాండము ఖానోత్పన్న నారాయణము అని తెలుసుకోవలెను.
తన పది వేళ్ళ గోళ్ళనుండి నారాయణ దశావతారములను ఉద్భవింపచేసినట్టిది ఆ జగజ్జనని. ఆ తల్లికి నమస్కారము 🙏
🌺బౌతికంగా, సామాజికంగా, ప్రకృతిపరంగా, మనస్సును కదిలించే అంశాలను పది దిక్కులనుంచి ఏదురుకోగలుగుతాము. క్రమ పద్దతులను నిష్టగా పాటించే అలవాటు కలుగుతుంది. 🌺
|