శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
97. సమయాంతస్థా | ||
*అంతస్థా* : సర్వమునకు చివర వున్నది, సర్వమునకు మధ్యవున్నది, సర్వాంతర్యామినియైన శక్తి ఏదో అదియే "అంతస్థా " లోపల వున్నది, అన్నింటా వున్నాది. "ఇందు కలడు, అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదికిచూచిన అందందే కలడు " అన్న మాటకు ఈ " అంతస్థా " అనేది నిదర్శనము. *సమయ* : దహరాకాశమునందు పూజచేయబడే ఆత్మ స్వరూపిణియైన దేవికి " సమయ " అని పేరు. త్రికోణాంతరంగుహంలో వున్న అణుదీపమైన ఆత్మదీపమె సమయ. మాయ మధ్యలో వున్నది. సర్వ నామరూప జగత్తునందు, సర్వణువులయందు ఆమె వున్నది కాబట్టి ఆమె మాయాంతస్థా. సమంతస్థా : అన్నింటినీ ఒక క్రమములో చేస్తూపోయేది, క్రమమును తప్పించగలిగేది - ఈ రెండూ ఆమెయే కాబట్టి ఆమె సమంతస్థా. దహరచక్రమే అహంచక్రం. అదే మాయా చక్రం. అదియే విష్ణుగ్రంధి. కావున అంతస్థా అన్నది దాహరగుహలోని త్రికోణాంతరదీపిక, అనుదిపము, అదియే ఆత్మ. కావున సమయాంతస్థా అనగా ఆత్మస్వరూపిణి అని అర్ధం. ముఖ్యప్రాణము కూడా 'సమయా'అని పిలవబడుతుంది. సమయా అంటే సుషుమ్న కూడా. అందు పయనిస్తే సహస్రారము చేరగలుగుతాము. అక్కడ అంటే సహస్రారము దెగర ఆ తల్లిని ఆరాధించాలి🙏 🌺మనల్ని మనం తెలుసుకోవాలి అంటే మనము ఆత్మ తో శోధన చెయ్యాలి. ఆత్మ శోధనతో బోతిక జ్ఞ్యానం ఏర్పడుతుంది. అంతర్గత పరిశోధన మనలో జరుగుతుంది. అందరిలోనూ వున్నది ఒకటే ఆ *పరంజ్యోతి,* *పరాత్పరి* అన్న జ్ఞ్యనం కలుగుతుంది. ఏకత్వ భావం కలుగుతుంది. ఈ ప్రక్రియలన్నియు మనకి సాధన వల్ల, అమ్మ నామ జపం వల్ల మనలో తెలియకుండా జరిగిపోతూవుంటుంది. 🌺 |