శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
79. భండా సురేంద్ర నిర్ముక్త శస్త్రప్రత్యస్త్రవర్షిణీ | ||
*భండ* : మనలోని కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, తనమత్ర పంచకములు మరియు పంచకోశములు ఇత్యాది. *ఇంద్ర* : మన ఇంద్రియములన్నిటికి రాజు మనస్సు. ఇంద్రుడు రాజైన కారణం చేత, ప్రజలైన ఇంద్రియములు కూడా ఇంద్ర అని పిలవబడుతాయి. అంటే మాయావైపు పరుగెత్తే మనస్సు అని అర్ధం. *నిర్ముక్త* : అమ్మవారి పూజలో శమదమాది షట్కసంపత్తి సాధకునకు లభిస్తుంది. చాతుర్యగక్రమముగా సాధనచేస్తే అతడు ముక్తుడు మాత్రమే కాక మరల మరల పుట్టుకు అన్న దానినుండి విముక్తుడవుతాడు. విముక్తుడగుటనే నిర్ముక్త అన్ని అర్ధం. *శస్త్ర* : శక్తి వంతమైన ఆయుధములు. *ప్రత్యస్త్ర* : శక్తివంతమైన ఆయుధములను ఏదురుకొనగలిగిన మంత్ర పూరితమైన ఆయుధములను ప్రత్యశాస్త్రములు అంటారు. *వర్షిణి* : ప్రత్యశాస్త్రములు వర్షముగా కురుపించుట.. అమ్మవారు చంద్రస్సరా, శాస్త్రస్సరా అన్న మాటల చేత తెలియ బడుతుంటే శాస్త్రముల సారమంతయు ఆమెయే కాబట్టి ఆమె నిర్ముక్తి రూపిణి. కులమార్గములో వెళ్లే కుండలిని అన్నింటిని సంహరించుకుంటూ పైకి చేరుతుంది. అదియే స్త్ర, శస్త్ర, ప్రత్యస్త్ర అనటంచేత కులాకుల మార్గమునందు పయనించే కుండలిని అని అర్ధం. భండా అంటే ఇంద్రియగ్రామము, అసుర అంటే అసువులయందు అంటే ప్రాణములయందు రమించుట. ఇంద్ర అంటే మాయగా పరిణమించుట. రహోయాగములో శస్త్ర అంటే ప్రాణమని, ప్రత్యస్త్ర అంటే అపానమని అర్ధం. నిర్ముక్త అంటే కుంభకం లేదా సూన్యకం. ప్రాణాపాన సంఘటనం చేస్తే అంటే కుంభకం, శూన్యకములు చేయుటచేత కుండలిని జాగృతమైసుషుమ్నగా మారి బ్రహ్మశీర్ష పర్యంతము ప్రయాణము చేస్తుంది అని దీనిలోని రహస్యం. భండాసురుడు ప్రయోగించిన శాస్త్రములకు ప్రతిగా అస్త్రాలను వర్షింపజేసిన తల్లీ కి నమస్కారము 🙏. 🌺స్థిరమైన మనస్సుతో, ధైర్యముతో, ముందుచపుతో దుష్టగుణాలు మనని ప్రభావితం చేయకుండా, బద్దకం, తప్పించుకోవడం లాంటి బలహీనతలు పెరగకుండా కాపాడుకోగలిగే తత్త్వం అలవడుతుంది. సమయస్పూర్తి పెరిగి చేయవలసిన పనిని సవ్యంగా, సమర్ధవంతంగా చేయగలుగుతాము 🌺 |