శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
19. నవచంపక పుష్పాభా నాసాదండ విరాజితా | ||
*నవచంపక పుష్పాభా* : కొత్త సంపెంగ పువ్వు కాంతి కలది అని అర్ధం . *దండవిరాజిత* : అమ్మవారి చేతులో వున్నా ఇక్షు కోదండము , మొదలైన ఆయుధములు , సృష్టి ని నియమించుటకు , .సమస్త భూమండలాన్ని అమ్మ అధీనం లో వున్నవి అని సూచిస్తాయి . అట్టి సమస్త ఆయుధ సంపన్న , సమస్త అలంకరణ సంపన్న అన్ని అమ్మవారి అధీనము లో వున్నవి అని అర్ధం. ఈ దండము కాలదండం . అంటే కాలము చేతనే జీవులను సృష్టించి కాలము చేతనే వారిని పెంచి , కాలము చేతనే వారిని త్రుంచే మహాకాళీస్వరూపిణి . అదియే దండ విరాజిత అన్న మాట కు అర్ధం . *రాజిత* : ఆ తల్లి ఎప్పటికీని కాంతిస్వరూపిణిగానే వుంటుంది . మనయందున్న కాంతి కూడా లలితపరమేశ్వరి యుక్క కరుణా లక్షణమే. ఈ నామం ద్వారా అమ్మవారి నాసా ( ముక్కు ) సౌందర్యాన్ని వివరించటం జరిగినది . సూటైన ముక్కు తో , ఇప్పుడే వికసించిన సంపెంగ పువ్వు వలే ఉంటుంది. కొత్త సంపెంగ పువ్వులు యుక్క కాంతితో , నాసాదండముతో వున్న తల్లి కి నమస్కారము 🙏 🌺 *ఈ నామం వల్ల మనలో కలిగే* *మానసిక పరివర్తనము* 🌺 అమ్మవారి రూపం మన మనసులో నింపుకొని , సదా నామ స్మరణ చేస్తూ మనలోని కోరికలు , సమస్యలు అమ్మకి విన్నపించుకుంటే అమ్మ మనయందు వాత్సల్యం తప్పకుండా చూపిస్తుంది . రక్షణ కలిపిస్తుంది .🙏 |