శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
56. శ్రీమన్నగర నాయికా | ||
శ్రీ' అనగా ఆత్మ - పరమాత్మ మూలకందమైన ఈశ్వర స్థానం. 'శ్రీ' ని కలవాడు.., శ్రీ తో కూడినవాడు. కామేశ్వరుడై తన సంకల్పమునతో బ్రహ్మాండమును, సమస్త ప్రపంచము పుట్టిన చోటు. *నగర* : త్రికోణమే నగము. బిందువు దానికి శిఖరము. మెరుప్రస్తారములో, లేదా శ్రీమన్నగరములో, 25 ప్రకారములతో కూడిన శ్రీనగరమే ఈ నగరము. అనగా శ్రీలలితా పరాభట్టారిక కొలువుతీర్చి ఉండేచోటు. *నాయిక* : ఆమె సర్వేశ్వరీ కనుక సృష్టి సమస్తమునకు ఆమెయే నాయిక. ఆమెపైన ప్రభువు ఎవ్వరు లేరు. తనయందే సర్వమునూ నిలిపి వున్నటిది, పూర్ణము, పరిపూర్ణము, పరా పూర్ణము ఆమెయే శ్రీలలితా పరాభట్టారిక. బిందువుతో కూడిన త్రికోణమే శ్రీమన్నగరము. శ్రీనగరము అనగా శ్రీచక్రము. మంత్రాధిష్టాన పరమేశ్వరి రూపమే శ్రమన్నగర నాయిక. శ్రీచక్ర నాయిక అయిన తల్లికి నమస్కారము 🙏 ఈ మన స్థూల శరీరమే శ్రీచక్రము.. దానికి అధిష్టాత్రి, నాయిక ఆ జగన్మాత. మనలో నివసిస్తోంది. అమ్మవారు మనతోనే వున్నది అన్న ధైర్యం మనకు కలుగుతుంది 🌺🙏. |