శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
46. శింజానమణిమంజీర మండిత శ్రీపదాంబుజా | ||
ధ్వని చేయుచున్న మణులు గల అందెలచేత అలంకరింపబడిన శోభగల పద్మముల వంటి పాదములు గలది. *శింజాన* : కాంతి, మెరుపు. వెలుగు మంత్రశాస్త్ర పరంగా కాంతి వెలుగుని పట్టుకొని ఆ వెలుగు ఎక్కడ వరకు వెళ్తుందో అక్కడ వరకు వెళ్ళాలి. అంటే ఆ వెలుగు యుక్క లక్షణాన్ని తెలుసుకోవాలి. *మణిమంజీర* : అంటే నాద స్వరూపిణి. సర్వ మాతృకావర్ణముల చేత అలంకృత అయినది. మణి మంత్రం శబ్దం చేత మంత్రబీజములు. మంజీర అనడంచేత సర్వసారస్వతo. మండితా శబ్దము చేత నాదబిందు కళావిలాసనమే నామరూపజగత్తు. ఖండ సృష్టియే ఆ తల్లి శ్రీపదములు. *భుజాన్వితా* : ఆజ్ఞాచక్రంలోని రెండు దళములే శ్రీపదాంబుజములు. అవియే తేజ పాదుకలు, గురు పాదుకలు. మణులతో కుడి, సవ్వడి గావించే కాలియందెలతో అలంకరింపబడిన పాదపద్మాలతో శోభిస్తున్న తల్లికి నమస్కారము 🙏 ఆడవాళ్లు కాళ్ళకి పట్టిలు పెట్టుకోవాలి, ఎందుకంటే పట్టీలునుంచి వొచ్చే మువ్వల శబ్దము postive energy ని మన ఇంటికి మరియు మన శరీరం లోకి పంపిస్తుంది . దుష్ట ప్రభావము ని బయటకు తరిమేస్తుంది. ఇంకా మన శరీరంలో పట్టీల కదలిక వల్ల రక్త ప్రసరణ సమతులయంగా ప్రసరించేటట్టు చేస్తుంది. ప్రతి స్త్రీ తన ఇంటికి లక్ష్మీదేవి. అందుకనే గృహ లక్ష్మి అన్నారు. ఘల్లు ఘల్లు మని మువ్వల శబ్దం తో ఇంటికి లక్ష్మి కళని తెస్తుంది . మన ఇంటిని లక్ష్మి గృహం గా మారుద్దాము. అంటే లక్ష్మిని స్తిరంగా మన ఇంట్లోనే వుండేటట్టు చేసుకుందాం. 🙏 |