శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
62. కామాక్షి | ||
అక్షి (కళ్లు)అన్న విషయంలో సూర్య -చంద్ర - అగ్ని మూడు అమ్మవారి యుక్క నేత్రాలు. కామ శబ్దంచేత ప్రపంచోల్లాస కాంక్ష పూరిత నేత్రాలు అని అర్ధం. శ్రీచక్ర అంత త్రికోణ బిందువులే మూడు నేత్రాలు. కామాక్షి అంటే "క్షయవృధి వినిర్ముక్తా ", అన్న నామానికి సమానమైన నామము. లోకంలో కామము చేత ద్వందములు ఏర్పడి, దానిచేత శక్తి హీనత, జరా, మృత్యు, దుఃఖములు కలుగుతాయి. అంశాంశాలుగా తన శక్తిని విభజించి, జగన్నిర్మాణము చేయుచు కామము, మోక్షము రెండింటిని సృష్టించింది ఆ జగన్మాత. మానవులు తన జీవిత పరియన్తము కామములు (కోర్కెలు) తీర్చుకోడానికే తమ సమయం గడుపుతారు. మోక్షము గురించి ఆలోచన చేయరు. క్షయము కానీ శక్తి గల ఈక్షణము కలది కామాక్షి. తన చుపుచేత నశ్వర నామరూపాత్మక జగత్తును నిర్మించినప్పటికీ ఆ నామరూపాత్మక జగత్తులో సర్వాణువులయందు, వాని మధ్యయందు తానే సర్వాతర్యామినిగా, అనశ్వర పరబ్రహ్మముగా జగత లీలావిలాసాన్ని నడిపిస్తున్న తల్లీ కాబట్టి ఆమె కామాక్షి. . అట్టి దయా వర్షమును కురిపించే నేత్రాలు గల తల్లికి నమస్కారము 🙏 దయార్ద్ర ద్రుష్టి గల అక్షములు (కళ్లు ) సకల కామనలనూ తీర్చునది కావున జగన్మాత కామాక్షి. 🌺అమ్మాయుక్క కరుణద్రుష్టి మనమీద ఉండాలి అని, ఆ తల్లీ నీ వేడుకుందాము. మోక్ష ప్రాప్తి కోసం ప్రార్థన చేద్దాము 🌺🙏 |