శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
3. శ్రీమత్ సింహాసనేశ్వరి | ||
ఇందులో గుప్త నామాలు ఉన్నవి . *ఈశ్వరి :* ఇక్షిత , కామ , తప , సంకల్పములు కలుగబోవునట్టి స్థితిలోవున్న అనంతత్వం పరమాత్మా స్వరూపం ఈశ్వరి లేక ఈశ్వర *హాసనేశ్వరి :* హస అంటే వికసించుట , నవ్వుట . బిందువు యుక్క వికసమునకు ఈశ్వరి అయనది . *సింహాసనేశ్వరి :* ఆ బిందువు తనని తాను ఆంశాలుగా విభజించుకోని హింస చేసుకొని సర్వసృష్టికి అలవాలమైనది . ఈ హింసాసనమే సింహాసనమైనది . దానికి ఈశ్వరి అయినది మహా లలిత . శ్రీమత్ సింహాసనేశ్వరి నామమూ రుద్రా శక్తి ప్రతిపాతికమైనది . .శ్రీమత్ సింహాసనేశ్వరియే పంచాననేశ్వరి . అంటే పంచప్రేత మంచాధిశాయిని , పంచప్రేతాసనాసీన అన్న నామములచేత తెలియబడే లలితాపరాభట్టారిక . పంచ శబ్దముచేత పంచకృత్య పరాయణీ సృష్టి , స్థితి , లయ తిరోధాన వమనములనే ఐదు ముఖములుగా సృష్టిని పునరావృతం చేసే మహాపరాశక్తియే శ్రీమత్ సింహాసనేశ్వరి . శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే పంచ ప్రణవాసన అను కూడా అర్ధం . .ఏమిటి పంచ ప్రణవము అంటే శ్రీ౦ హ్రీ౦ క్లి౦ ఐ౦ సౌ: అట్లే పంచ కళామయాసనా = నివృత్తి , ప్రతిష్ట విద్య , శాంతి శాంత్యతీత ఈ ఐదు బ్రహ్మయుక్క పంచకళలు . దానినే ఆసనం గా చేసుకున్న లలిత పరమేశ్వరియే శ్రీమత్ సింహాసనేశ్వరి . అట్లే పంచప్రేతాసనగా కూడా శ్రీమత్ సింహాసనేవారి నామాన్ని తెలుసుకోవాలి . బ్రహ్మ , విష్ణు , రుద్ర ఈశ్వర సదాశివులే పంచప్రేతములు .సృష్టి క్రమంలో వీరే పంచ బ్రాహ్మలవుతారు , సంహార క్రమంలో వీరే పంచప్రేతములవుతారు .ఇది శ్రీమత్ సింహాసనేశ్వరి నామం లో రహస్యాతి రహస్యం . సింహాసనంపై ఆసీనురాలైన తల్లి కి నమస్కారము 🙏 🌺ఈ నామం వల్ల మనలో కలిగె మానసిక పరివర్తనం🌺 మనలో పశుప్రాయ లక్షణాలును నిర్ములించాడానికి కావలసిన సాధనను , నియమాలను క్రమబద్ధమైన ఆచరణలు తెలుసుకొని పాటించగలిగే స్వభావం కలుగుతుంది . మనవి మనం సరిదిద్దుకొని ఠీవిగా జీవితం అనే సింహాసనంపై కూర్చోగలిగే అర్హతను అవకాశమును పొందుతాము 🙏 |