శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
16. ముఖచంద్ర కళంకామృగనాభివిశేషకా | ||
ఈ సమస్త సృష్టి ' *ఓం* ' లో నుండి జన్మిచింది . ఆ ఓం *ఈ౦* నుండి జన్మిచింది . ఈ ఓం వైవర్త రూపమై *హ్రీ౦* అయింది , *క్లి౦* అయంది, *శ్రీ౦* అయింది . ఇంకా 50 మాతృకావర్ణముల బీజస్వరూపం అయినది . ఇది అంత తల్లి యుక్కా నాదముఖం నుండి వచ్చినదే .ఆ ముఖం చంద్రుని వలే ఆకర్షణీయముగా ప్రకాశిస్తుంది . *కళ* : అంటే అంశము అని అర్ధం .అఖండ చైతన్యము తనని తాను అంశాలు గా మార్చుకుంటే తప్ప సృష్టి జరగదు .అందుచేత ఆ తల్లి కళ . ఆ కళనే *చంద్రకళ* .అమ్మవారి చంద్రబిందువు , ఈశ్వరుడు అగ్నిబిందువు . పరస్పర ఉన్మేషణము చేత ఏర్పడినదే సృష్టి. ' *చతుర్భుజే చంద్రకళా వతంసే* *కుచోన్నతే కుంకుమ రాగశోభే* ' అని కాళిదాసు వర్ణించినట్లు అట్టి చంద్రకళ , అమృతకళ ఆ తల్లి . అదియే అమ్మవారి కిరీటంపైనా చంద్రరేఖ వలే వుంటుంది . *కలంక* : చంద్రునిలో మచ్చ ఉన్నట్లుగా ... *మృగనాభి* : జింక నాభి నుండి తీసిన కస్తూరి. అమ్మవారి ముఖమునందు కళంకము వలే కస్తూరి తిలకము వుంటుంది . *విశేషకా* : అమ్మవారి యుక్కా చూపు , అమ్మవారి ఆకృతి, విశేషము . ఆమె ముఖ దర్శనము కలుగగానే మనలోని మృతత్వపోయి అమృతతత్వమై ఆత్మదర్శనం జరిగినట్టుగా భావించుకోవలె . చంద్రుని బోలిన అందమైన ముఖంలో , చంద్రునిలో మచ్చ మాదిరిగా కస్తూరి తిలకాన్ని ధరించిన తల్లి విశేషంగా స్మరించుకోవాలి .ఆ తల్లి ప్రతిబింబానికి నమస్కారము🙏 🌺 *ఈ* *నామం వల్ల మనలో కలిగే* *మానసిక పరివర్తనము* 🌺 ఎంచుకున్న లక్ష్యం ఏకాగ్రత తో ఆ తల్లి ప్రతిబింబాన్ని ఒక బిందు గా భావించుకొని , మన మనసును కేంద్రీకరిస్తాము 🙏 |