శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
86. కంఠాదః కటిపర్యంత మధ్యకుటస్వరూపిణి | ||
*కంఠాదఃకటిపర్యంత* : అంతర్యాగ రహోయాగాల్లో కంటమంటే విశుద్ధచక్రము, కటిపర్యంతమూ అంటే మూలాధారము. అంటే విశుద్ధము నుండి మూలాధారము వరకు అని అర్ధం. *మధ్యకుట* : మధ్యకుట అనుటచేత ఇడ, పింగళ, మధ్య బిసతంతు తనియసి వలే సుషుమ్న వెళుతుంది. అంటే ప్రతిరూపమునందు దాహరచక్రములో ఆత్మస్వరూపిణిగా ఆ పరంజ్యోతి వుంటుంది. *స్వరూపిణి* : సమస్త నామములు అంటే అరూపము, విరూపము, స్వరూపము, కురూపము అన్నియు తానెయైనది కాబట్టి స్వరూపిణి. కంఠాదః కటి పర్యంత అనే ఈ మాటలో విశుద్ధమునుండి మూలచక్రం వరకు వున్న రహోయాగ రహస్యం ఇంకొకటి వున్నది. కంఠామునందు వున్నది విశుద్ధ చక్రము. దానికి పదహారు దళములు. అనాహతమునకు పన్నెండు దళములు. మణిపురమునకు పది, స్వాధిష్టానమునకు ఆరు, మూలాధారమునకు నాలుగు. మొత్తం 48 మాతృకావర్ణములు అని అర్ధం. కంఠం క్రింది నుండి నడుము వరకు వున్న కామరాజకుటమును గల తల్లికి నమస్కారము 🙏. 🌺సంఘంలో మెలగగలిగే సభ్యత, సంస్కార జ్ఞ్యాన బీజాలు, మన వాక్కు ద్వారా అక్షరముల ద్వారా వెలువడుతుంది. మర్యాద, మన్నన, ప్రేమ, వాత్సల్యం మొదలైనటువంటి మనలో వుండే గుణాలు ఇంకా శక్తిని పొంది, కంఠం నుండి కటి వరకు వున్న శక్తి కేంద్రాలను ప్రేరేపించబడుతాయి 🌺. |