శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
31. కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా | ||
*కనక* : కాంచనం, బంగారము. ఇది సామాన్య అర్ధము అంతరార్ధం ఏమనగా, ఆ తల్లియుక్క కాంతిప్రభలు హృదయాకాశములోనికి వచ్చినప్పుడు అవి కనకప్రభలుగా ఉంటాయి. **అంగద కేయూర* : ఈ రెండు అమ్మవారి యుక్క భుజకీర్తులయుక్క విలక్షణ స్వరూపాలు. సామాన్య అర్ధం తెలుసుకుంటే,.. అంగద, కేయూర వంటి బంగారు ఆభరణాలు తో అలకరించుకున్నది అన్న అర్ధం కూడా తీసుకోవచ్చు . ఇది మూర్తి వర్ణనకు మాత్రమే పరిమితం. *కమనీయ* : అంటే సౌందర్యము. దేవి యుక్క సర్వము సౌందర్యయుతమే. సర్వము శివకరమే. సర్వము సుమంగల్యమే. అందుచేతనే ఆ తల్లిని సౌందర్యలహరి అన్నారు. ఆమె రూపము, అంగప్రత్యంగము, ఆమె చూపులు, ఆమెయుక్క సర్వము కమనీయము. కాబట్టి ఆమెని కమనీయ అని పూజ చేస్తే మనకు కూడా కమనీయమైన మనస్తత్వము, కమనీయమైన సర్వము వస్తుంది. *భుజాన్వితా* : ఇక్కడ భుజాన్విత అని చేపటానికి కారణమూ అమ్మవారి ఉపాస్యరూపము మొదట శ్రీచక్రమే. తరువాతనే మూర్తులు వచ్చినవి కాబట్టి, శ్రీచక్రములో వున్నా త్రికోణముయుక్క భుజములు, అట్టి భుజములుతో కూడినట్టిది అమ్మవారి యుక్క ఉపాస్యస్వరూపము అని దీని అందలి అర్ధము. అంగద కేయూరలనే బంగారు ఆభరణాలను భుజములకు అలంకరించుకుని ప్రకాశిస్తున్న తల్లి కి నమస్కారము 🙏. 🌺 *ఈ నామం వల్ల మనలో కలిగే* *మానసిక పరివర్తనము* 🌺 మనలో సర్వము ఒక కమనీయమైన మనస్తత్వము కలిగి, ఆత్మ విశ్వసం భుజబలం ద్వారా వ్యక్తమవుతోంది 🙏 |