శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
83. బ్రహ్మోపేంద్ర మహేంద్రాదిదేవసంస్తుత వైభవా | ||
*బ్రహ్మా* : ఈ సమస్త సృష్టికి మూలకారణము ఆ జగజ్జనని కాబట్టి ఆమెనే బ్రహ్మా-బ్రహ్మణి. *ఉపేంద్ర* : స్థితి ని కల్పించించే విష్ణుస్వరూపమే ఉపేంద్ర. ఆమెనే స్థితి రూపిణి. *మహేంద్ర :* దేవరాజైన మహేంద్రుడు శ్రీవిద్య లో నిష్ణాతుడు. శ్రీనగరము యుక్క సింహ ద్వారము దెగ్గర ద్వారపాలకుడుగా వుంటాడు. *ఆదిదేవ* : సాధారణంగా సదాశివుడనే ఆదిదేవుడు అని అంటారు. కానీ, ఈశ్వర సంకల్పానికి తరవాత సృష్టి ని కల్పించటానికి ఏర్పడిన మొట్టమొదటి తేజస్సు ఏదో అదియే ఆదిదేవుడు. అదియే గణపతి. వినాయక. అమ్మవారికి చెందవలెను అంటే వినాయకి అని అంటారు. *సంస్తుత* : స్తోత్రము చేయబడినది. మనం మాటాడుతున్న అన్ని మంచిమాటలు, అన్ని తత్వపు మాటలు, భజనలు ఆమెయుక్క గుణగానములు చేస్తాయి కాబట్టి ఆమె స్తుతింపబడుతుంది. అదియే సంస్తుత. పంచబ్రహ్మలు, అష్టదిక్పాలకులు అందరు జగన్మాతయుక్క అంశాలే. ఆ అంశమునకు పూర్ణము ఎప్పటికిని ఆరాధ్యమే. బ్రహ్మోపేంద్ర దేవతలందరూ అమ్మవారియుక్క పరివార దేవతలు. అంశ స్వరూపులు. వారిని స్తుతి చేతనే శక్తి సామర్ద్యములు కలుగుతాయి. స్తుతి చేసిన వారికీ చేసినంత ఫలితము. ఆ పరాజనని నామపారాయణ ప్రీతి. భండాసుర వధ పరాక్రమాన్ని చూపిన ఆ లలితాంబిక ని బ్రహ్మా, విష్ణు, ఇంద్రాది దేవతలచే స్తుతింప బడిన ఆ తల్లికి నమస్కారము🙏. 🌺మనయుక్క బాహ్య ఉనికి, అంతః కరణాలు, ఉన్నతమైన సాధనకు, అవసరమైన దేవత్వాన్ని, శుద్ధత్వాన్ని సంతరించుకుంటాము🌺🙏 |