శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
50. అనవద్యాంగీ | ||
*అంగి* : ఈశ్వరి లేక ఈశ్వర అని అర్ధము,. తనయందే మాయను కూడా అంగభూతములుగా కలిగివున్న ఈశ్వరపదార్తముకే అంగి అని అర్ధం. *అనంగి* : పరిపూర్ణ ఈశ్వరలక్షణము అంగాంగ విభజనముగా ఉండదు కనుక ఆ లలితయే అనంగి. *నవాంగి* : ఉపాస్యమైన శ్రీపరదేవతాస్వరూపమే, నవావరణ శ్రీచక్రం. శ్రీచక్రమునకు ఆవరణములో అంగములు. కాబట్టి నవాంగి *అద్యాంగి :* ఆద్యమైన అంగము ఈశ్వరునకు రక్తబిందువు. అదే మొదటిగా అఖండత్వాన్ని ఖండత్వం గా చేసింది. ఆ మహామాయాస్వరూపమే ఆద్యాంగి. ఆమెయే ఆద్యచైతన్యస్వరూపము. అంగి అంటే ఈశ్వర ప్రతిబింబమును తనయందు అంగముగా దాచుకున్నది. ఆ రక్తబిందువు మరల ఈశ్వరునకు సంకల్పరూపముగా అంగమైనది. అనగా ఈశ్వర, మహామాయా రెండునూ పరస్పర అంగ, అంగి భావములు కలవి. ఈ రెండు సమరస సమలీనములు కావున అనవద్యములు. " ***పూర్ణమాద పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే "* ఆ రెండునూ పరపరిపూర్ణముయుక్క అమూర్తముర్తాబ్రహ్మస్థితి. ఇదియే నవద్యాంగి నామములో అంతరార్ధము. దోషరహితమైన అంగములు గల తల్లికి నమస్కారము 🙏. మన శరీరములో అన్ని అంగములు ఆ జగన్మాత ఇచ్చిన బిక్ష. వాటిని కాపాడుకుంటూ, శరీర ఆరోగ్యము వక్రించకుండా కాపాడమని ఆ తల్లిని వేడుకుందాము. 🙏 |