శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
88. మూల మంత్రాత్మికా | ||
మూలస్వరూపిణి అంటే ఆత్మస్వరూపిణి అని అర్ధం. ఇందులో కొన్ని గుప్తనామాలు *కాలమంత్రాత్మిక :* కాలరహస్యముయుక్క ఆత్మ తానైనది. అంటే కాలాతీతస్వరూపిణి, కాలస్వరూపిణి అని రెండు అర్ధాలు. మూలమంత్రాత్మిక అంటే కా ఏ ఈ ల హ్రీo, హ స క హ ల హ్రీo, స క ల హ్రీo లో ముఖ్యమైన మూలమంత్రం క ఏ ఈ ల హ స. ఇది మూలమంత్రం. దీనిని కుదిస్తే ఐం క్లిo సౌ:. ఇది మూలమంత్రతమిక. సదాశివునిచే జపించబడిన బలమంత్ర విశేషము. ఆత్మిక అంటే ఈo లేదా హ్రీo లేదా శ్రీo. ఈ మూడింటియందు వున్న ఈo కారమే మూలమంత్రము. ఆత్మిక లో ఆత్మ చాలా ముఖ్యమైనది. మన ఆత్మ రూపంగా వున్న తల్లికి నమస్కారము 🙏 🌺మన ఆత్మ ప్రేరేపణ తో పలికే బీజాక్షరాల మనలో ఆత్మ గౌరవాన్నీ, వాటినుండి ప్రాణ శక్తిని పెంచుకోగలగడం తెలుస్తుంది 🌺 |