*చిత్* : అంటే ఈశ్వర్ సంకల్పమే , ఈశ్వర్ చైతన్యము అదే ఆద్య చైతన్యము , ముల చైతన్యము .
'మనో బుద్ధి అహంకార చిత్తానినాహం'. నిర్వాణం షట్కర్మలో శంకరభగవత్పాదులు అంటారు. చిదానందరూపం శివోహం శివోహం. నాది అన్నది ఏది లేదు అంతా ఈశ్వర్ సంకల్పమే.
*అగ్ని* : చిత్ అన్న పదార్తమునే శుక్ల బిందువు , అగ్ని బిందువు ,ఈశ్వర్ బిందువు ,సదా శివ బిందువు అని పిలుస్తారు.
*చితాగ్నికుండ* : శ్రీచక్రమునందు బిందు సంయుతముగా వున్నా త్రికోణమే చితాగ్నికుండం .బిందువు అగ్ని సోమమయం జగత్ అన్నారు .ఆ బిందువు శివశక్తిలుగా రెండే ఆ రెండింటి పరస్పర ఈక్షణంచేత త్రికోణాకృతి చేత పరంజ్యోతు ఏర్పడింది .దానిలో బిందువు వున్నది కనుక అది చిదగ్నికుండమైనది .
*సంభూత* : త్రికోణ చక్రం నుండిఇత్యాది సృష్టి క్రమాన్ని తెలిపే శ్రీచక్రం ఉద్భవించింది . ఈ బిందువు నుండే సకల జగత్తు వుద్భవించింది కనుక ఆ చిదగ్నికుండాన్ని సర్వ సంభూత అని కూడా అనవచ్చు.
కేవలం రూపమును జడముగా సృష్టించినంత మాత్రం చేత సృష్టి వికాసనం జరగదు కాబాట్టి , అందు తాను ప్రాణ స్వరూపిణి అయి కూర్చున్నది .
కాబట్టి చిదగ్నికుండాన్ని చిదభూత అని అన్నారు. పుట్టించిన జీవులయందు ఆహార , నిద్ర , భయం లక్షణములు కల్పిచినది . వీటికి ఆకలిని సమష్టి కృత్యముగా చేసింది.
ఈ ఆకలి నుండే సంతోషం -దుఖం , శాంతం - ఆగ్రహం , తృప్తి - ఆశ , మంచి - చెడు , ధర్మం - అధర్మ సంకేతాలు కలుగుతాయి . తద ద్వారా మనాలో జడత్వం ని పోగొట్టి చైతన్యము ప్రసాదిస్తుంది .
ఆకాశము , వాయువు, అగ్ని , అపస్సు , పృద్వి , తేజస్సు లో సర్వ ప్రాణులలు చైతన్యము అన్న లక్షణాలను సృష్టించి తన సృష్టి కార్యము నిర్వహించే పరపరమేశ్వరి భూతచిత్ ఆయనది .
శివ శక్తి బిందువే ఆద్యచైతన్య రూపాంతం . అంటే పుట్టబోయే , పుట్టిన , పుట్టి మట్టిలో కలిగిన సమస్త జీవులను తన గర్భంలో యిముడ్చుకొని , యా మొత్తము చైతన్యానంత అవ్యక్త రూపం లో కొంత , వ్యక్త రూపం లో కొంత ఉంచి జగత్ పాలనా కార్యక్రమాన్ని నిర్వర్తించే లలిత పరమేశ్వరి యుక్కా నామం ఇది .
ఈ నామము మనలో కి ప్రయాణం చేస్తూ మనను జీవిత యాత్రా చేయిస్తున్న ఆ ప్రాణ శక్తి ద్వారా మనయందు జీవభావమై , దైవ భావము ,పశు భావము , అసురభావము మొదలైన అన్ని భావములను తన మాయా శక్తి చేత ప్రేరేపణ చేస్తూ , మనయుక్క సంస్కారాన్ని బట్టి ఆ శక్తి ఒకప్పుడు దైవశకి అవుతుంది. లేక పొతే అసురశక్తి అవుతుంది.
ఈ రకంగా ఏక అనేక భావాలను ఆ శక్తియే ప్రదర్శన చేస్తూ.. తన విలాసం కోసం ఆ రక మైన చిద్విలాస నాట్యం చేస్తూవుంటుంది
అఖండ అద్వయ ఆనంద పరచితి యుక్కా ఇచ్చా, జ్ఞన , క్రియ శక్తుల విభజనమే ఆ హింసాసనము . ఆ హింసాసనమే చిదగ్నికుండము ..అదే శ్రీమత్ సింహాసనేశ్వరి .
ఈ రకంగా ఇంతకు ముందు వున్నా నామము కూడా ఒకదానికొకటి పరస్పర సంబంధించి వున్నాయి . ఈమయే స్థూల సూక్ష్మ భూత స్వరూపిణి ఐనా చిదగ్నికుండము .
అమ్మవారి నామములో జడచేతనాశక్తి మహా మాయ స్వరూపమును చిదగ్నికుండ సంభూత అనే నామం తెలియ పరుస్తుంది .
'చిత్ అగ్ని ' అనే కుండము (శుద్ధ చైతన్యం ) నుడి ఉద్భవించిన తల్లి కి నమస్కారము 🙏
🌺ఈ నామం వల్ల మనలో కలిగే మానసిక పరివర్తనం🌺
మనసులో సత్సంకల్పాలు కలిగి వాటిని పొందగలిగే మార్గం గోచమువుతుంది .ఆ మార్గంలో నడిచి లక్ష్యం సాధించడానికి కావలసిన చైతన్యం అనే జ్యోతి జనిస్తుంది .🙏
|