*తారాకాంతి* : శుక్రుడుయుక్క కాంతి అని
కుజగ్రహము యుక్క మంగళ కాంతిని కూడా అని అంటారు . కాంతిని కుజ గౌర్యాం - కుజునియుక్క కాంతి , రాహు గురౌర్యం - రాహుగ్రహానియుక్క కాంతి . చంద్ర గౌర్యాం - చంద్రగ్రహానియుక్క కాంతి , శుక్ర గౌర్యాం - శుక్ర గ్రహ యుక్కా కాంతి . అన్ని గ్రహాల కాంతి కంటే శుక్రగ్రహ కాంతి తేజోవంతం .
తిరస్కారి : విశేష కాంతి శుక్రగ్రహ కాంతిని మించిన కాంతి .
*భరణ భాసురా* : శ్రీచక్రం లో వున్నా 45 కోణములు మరియు సంధులు మర్మములు ఇద్యాదులన్నీ కూడా బిందుయుక్క కాంతి చేత తాము కాంతివంతములౌతాయి .
బిందువుయుక్క కాంతిని తమయందు ప్రతిఫలనం చేసుకోవడం చేత శ్రీచక్రాకాంతి భాసురభరణము అవుతుంది .
ఆకాశమంతా వెలుగుతున్న నక్షత్రములను ఒకసారి చుస్తే అది కాంతి భాసురభరణము కాదా ! అమ్మవారికి ,...
ప్రతి ఇంట వెలుగుతున్న దీపాలయుక్క వరుసని చుస్తే అది కాంతి భాసురభరణము కాదా !అమ్మవారికి,.....
ఈ భూ ప్రపంచంలోనే ఇంత నిదర్శనము కనిపిస్తున్నపుడు , ఆ తల్లి సర్వ తేజాస్సు కు తేజాస్సు అని తెలుస్తోంది .
*నాసాభరణము* : అంటే విశ్వప్రాణాభరణము .
అమ్మవారు విశ్వాకుండలిని కాబట్టి ఆమె సంకల్పాలే శ్వాస గా వచ్చి మనలో సంకల్పమును కిలిగిస్తాయి .
ఎక్కడ శ్వాస వున్నదో అక్కడ నాదమున్నది .
ఎక్కడ నాదమున్నదో అక్కడ అగ్నీ వున్నది .
ఆ అగ్నీ చిదగ్ని .
ఈ మూడింటియుక్క సమ్మెళనమె ఆ లలితా పట్టారికయుక్క శ్రీరాజరాజేశ్వరీ యుక్క ముక్కెర , లేక నాసాభరణము .
నాదము ప్రాణంగా బాహిర నుండి అంతరంలోకి వెళ్లే మార్గము నాస .
మాములు జీవులకు ముక్కు రంధ్రముల నుండి బయటి ప్రాణం లోపలకు వెళ్లి ,లోపలి ప్రాణమును బ్రతికిస్తుంది .
నాసికయే విస్వప్రాణాన్ని పాంచభౌతిక పదార్థ నిర్మాణ కుశలంగా చేస్తుంది .
ప్రాణము ముక్కు రంద్రములోకి ప్రవేశించిగానే పాంచభౌతిక లక్షణాన్ని స్వీకరిస్తుంది .
నాసారంద్రములోనే అఖండ ప్రాణంగా, ఖండ ప్రాణంగా అంటే , అపాన , ఉదాన వ్యాన , సమానములుగా సమాహారమై ,. పృద్వి, అపహ, తేజో , వాయురాకాశ , పంచికరణ లక్షణంతో శ్వాస అవుతుంది .
కుడి రంద్రంలోనుండి కొంతసేపు ప్రాణం లోపలకు ప్రయాణం చేస్తుంది .అదే సూర్య నాడి .
ఎడమ అయితే చంద్రనాడి .
రెండు నాసారంద్రములోనించి ప్రాణాచలనం సమానంగా ఉంటే అదే సుషుమ్నా జాగృతి .
ఆ నాసాభరణము అమ్మవారి సుషుమ్నా లక్షణాన్ని తెలియపరుస్తుంది .
శుక్రగ్రహ కాంతిని కూడా త్రోసిపుచ్చే కాంతి గల నాసాభరణము ధరించిన తల్లి కి నమస్కారము 🙏
🌺 *ఈ నామం వల్ల మనలో కలిగే* *మానసిక పరివర్తనము* .🌺
మనలోని శ్వాస మంచి సంకల్పము గా మారడానికి , అమ్మవారి ని ప్రాదిస్తాము . చెడు సంకల్పమును తన ముక్కెర కాంతి తో భస్మం చేయమని వేడుకుంటాము .🙏
|