ఇందులో కొన్ని గుప్త నామాలు
*ఆలోక* :అంటే ఈక్షణం, చూపు. ఆమెయుక్క ఈక్షణము కరుణాలక్షణముతో వుంటుంది.
*కల్పితశ్రీ :* సదాశివుని యుక్క రూపమును తనలో ప్రతిబింబించుకొనుటయే కల్పితశ్రీ
*శ్రీగణ* : బిందు, స్పంద, ప్రతిస్పందములుగా అనంతము వరకూ పయనించే సృష్టిగాని, లయముగాని అది శ్రీగణమే. అకారము, నిరాకారమైన అది శ్రీగణమే
*ఈశ్వర :* సర్వమునకు అధిష్టాత్రి, సర్వమునకు పరాదేవత.
*కామ* : జగత సృష్టి సంకల్పించిన ఈశ్వర సంకల్పమే కామ.
*శ్రీలోక* : ఈ పదునాల్గు ఊర్ధ్వ భువనములు, అధోభువనములకు పైన వున్న అమ్మవారి లోకమునే శ్రీలోకము అని పేరు.
*కామేశ్వర ముఖా* : కర్మశేశ్వరునీతో తాను సదా కలిసి వుండటంతో ఆమె కామేశ్వర ముఖా.
*శ్రీగణేశ్వరా :* సృష్టికి ఆది ఎవరో ఆది శ్రీగణేశ్వర. కామేశ్వర ముఖమును చూచినది రక్తబిందువు. ఈశ్వర ప్రతిబింబము కల్పిత రూపము. ఈ కల్పన వలనే సృష్టికి శ్రీ గణేశ్వర అని పేరు.
కామేశ్వర ముఖముని చూచి కల్పించిన గణేశ్వర రూపము. ఆ తల్లికి నమస్కారము🙏
🌺సాధన వైపు కేంద్రీకృతం చేసే తత్వమునకు ఏ విధమైన అవాంతరాలు, అడ్డంకులు, విఘ్నలు కలగకుండా ఉండాలి అనే చూపు అమ్మ ప్రసాదిస్తుంది. అనుమానాలు, భయాలు లేకుండా. ముందుకు సాగడానికి మనస్సు సహకరిస్తుంది. అలసట, నిద్ర, పిరికితనము మొదలైన బలహీనతలు పోతాయి. 🌺
* *నిర్భిన్న* : తనను తాను అంశలుగా చేసుకున్న శ్రీమత్సింహాసనేశ్వరి.
*మహా* : ఈశ్వర యుక్క అహంకార ప్రతిబింబ స్వరూపము.
*విఘ్నయంత్ర* : సమస్త సృష్టియు విఘ్నయంత్రస్వసరూపమే. దానికి కారణము మాయ.
*మహాయంత్ర* : శ్రీచక్రమే మహాయంత్రము లేక చక్రరాజము
.
*మహాహర్షితా* : ఆమె ఆనందఘన కాబట్టి, ఎప్పుడును మహాహర్షిత్స్వరూపముగానే వుంటుంది.
మనలో వుండే స్వభావము క్రోధ, మద, మాత్సర్యం వంటి విఘ్నయంత్రములను ప్రవేశ పెట్టెన రాక్షసులను నశింపజేసిన మహాగణేశుని పరాక్రమానికి సంతోషించిన తల్లికి 🙏
🌺మనం ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎదురైయే ప్రలోభాలను ఎదురుకునే మనోధైరము కలుగుతుంది. మనమీద మనకు విశ్వాసం కలుగుతుంది 🌺
|