శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
17. వదనస్మరమాంగల్య గృహతోరణచిల్లికా | ||
సృష్టిని చేయవలెనంటే తగిన కారణ లేకుండా ఉండదు . కారణము యుక్క రూపమే సంకల్పం . ఆ మూలకారణం రక్తబిందువుగా ప్రవహించినప్పుడు అది సృష్టి అయినది . కాబట్టి అమ్మవారు కారణానికే కారణ అన్నమాట . అంటే ఈ నాడు మనము చూచే నామ రూపములను సృష్టి చేసేందుకు కారణం ఒకటి అయితే ఈ కారణమును కారణమైన తల్లియె పరాభట్టారిక 🙏. ఈ సృష్టిని మంగళప్రదం చేయడానికే ఈ నామం చెప్పబడినది . 🙏 *వదన* : అంటే ముఖం( మన వాడుకలో అర్ధం ). ' ఆకాశం యస్య రూపం ' ఇక్కడ ఈశ్వరుడు అమ్మవారి సృష్టి కి రూపం తెచ్చినవారు కాబట్టి ఆకాశమే వారిద్దరి వదనం (ముఖం)అని చెపుతున్నారు .మేఘాలు అమ్మవారి కురులు .గ్రహనక్షత్రతారకా కూటములే కబరీ ఫలమునందు సవరించుకున్న అలంకారములు , పుష్పములు. వదన ని ఈ రీతిగా భావించవలెను . *స్మర* : మదనుడు (కామేశ్వరుడు) స్మర అంటే శృంగారమదన అని అర్ధం .శ్రీచక్రమే శృంగార చక్రమని అంతరార్థం . శృంగారము లేనిదే సౌందర్యము లేదు . అమ్మవారి కి శృంగారవల్లి అన్న పేరు కూడా వున్నది .ఇక్కడ స్మరుడు (కామేశ్వరుడు) మానవులలో శృంగార మనే సంకల్పాన్ని కలిపిస్తాడు . *మాంగల్యం* : , బిందు , గృహమునకు కట్టిన తోరణం . బిందు మధ్యగతమైన శ్రీచక్ర అంతర త్రికోణమే మాంగల్యం .అదియే అమ్మవారి మంగళసూత్రం . తోరణ : గ్రహ నక్షత్ర తారక అ మాంగళ్య గృహమునకు తోరణముగా భాసిస్తాయి. *చిల్లికా* : కనుబొమల అంటే ఒక దాని నుండి ఒకటి అల్లుకోవటం .ముగ్గువలే , లతవలే పెనవేసుకొని . అమ్మవారి కనుబొమల అ రీతిగా వున్నాయి . సంక్షిప్తంగ చెప్పాలి అంటే వదన అనే మదన గృహానికి కట్టబడిన మంగళతోరణము వలే వున్న కనుబొమల కలది అని "వదనస్మరమాంగల్య గృహతోరణచిల్లిక " అన్న నామముకు అర్ధం . అంతర్గత అర్ధం లో .... వదన అంటే ఇక్కడ 'ఐ౦'అన్న వాక్భవకూటముయుక్క బీజము . స్మర అంటే క్లి౦ అన్న బీజము , మాంగళ్య అంటే సౌ౦: అన్న బీజము .గృహ అంటే శ్రీ౦ అన్న బీజము .తోరణం అంటే హ్రీ౦ అన్న బీజము . ఈ ప్రకారం గా చుస్తే ఐ౦ ,క్లి౦ ,సౌ: ,శ్రీ౦ , హ్రీ౦ ఇవే శ్రీవిద్య యందు ముఖ్య బీజాలు. ఈ రకంగా రహస్యాతి రహస్యంగా ఈ వదన స్మర మాంగళ్య గృహతోరణచిల్లిక అన్న నామం లో ఇంత విద్య ని ఆ తల్లి నిక్షిప్తం చేసి ప్రపంచానికి ఇచ్చింది . వదన అనే మదన గృహానికి కట్టబడిన మంగళతోరణమువలే వున్న కనుబొమల తల్లికి నమస్కారము 🙏 🌺ఈ నామం వల్ల మనలో కలిగే మానసిక పరివర్తనము🌺 మన ఆలోచనలు , మార్గాలు , వాటిని అనుసరించే ఏకాగ్రత ను కలిగించటానికి , .. జ్ఞననేత్ర స్థానము మన కనుబొమల మధ్యన ఉంటుంది . ఈ ఏకాగ్రత కలిగినప్పుడు ,... మనకు కలిగే సత్భావనకు ఈ కనుబొమల మంగళప్రదమైన మామిడితోరణము వలె ఉంటాయి .🙏 |