శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
48. మహాలావణ్య శేవధి: | ||
అమ్మ ప్రజ్ఞా పారమ్యమును ఎవ్వరు చెప్పగలరు? ఆ తల్లి కృప వల్లే మానవునియందు ఉదాతసంస్కారములు, ప్రజ్ఞాపాటవములు, దివ్యత్వము అన్ని వస్తాయి. శ్రీచక్రము శక్తి స్వరూపము. బిందు, స్పంద, ప్రతిస్పంద నిరంతరమూ పరస్పర ఈక్షణమే సమసోమ సంజ్ఞ కలది. సచ్చిదానంద లక్షణము కలది. చాతుర్యాగక్రమంలో రహోయాగములో అమ్మవారు నౌరోహి. తొమ్మిది ముఖ్య చక్రములను అధిరోహించి వెళుతూ బ్రహ్మశీర్షమనే బ్రహ్మకచ్ఛము దగ్గర అమృత వర్షిణి అవుతుంది. అదియే సర్వసౌందర్యస్పందనము. దాని వ్యాపిని లక్షణం మహాలావణ్య సంజ్ఞ శేవధి:., అని అనడంచేత శ్రీచక్రాస్వరూపిణి అని రహస్యం. ఉదానప్రాణరూపిణి అని కుడా అర్ధం. రహోయాగములో వనదుర్గయే ముఖ్య ప్రాణస్వరూపిణి. పిండాండము నందు వనం అంటే పద్మాతవి., అనగా కులమార్గములోని పది చక్రములు పద్మాటవీ. అక్కడ అమ్మవారు సకల. ఆజ్ఞపైన వున్న మిగిలిన 12 చరములు మహాపద్మాటవీ. దానినే కులాకుల మార్గము అంటారు. ఆ కులాకుల మార్గములో ప్రస్థానంచేసే సుషుమ్నా స్వరూపిణి ఎవ్వరో ఆమె మహాలావణ్య శేవిధి: అతిశయ సౌందర్యానికి నిధీ వంటిదైన తల్లికి నమస్కారము 🙏 🌺ఈ నామం తో మనలోని గుర్తింపు, మార్పు, వివేకం, జ్ఞానం భాహ్యంగానూ, ఆకర్శణీయంగా కనబడతాయి. 🌺 |