శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
49. సర్వారుణా | ||
*అరుణ :* అనగా రక్తబిందువు అని గుర్తుపెట్టుకోవలెను. అంటే అదే జగత్ ప్రసవిని, సావిత్రి, గాయత్రీ, జగన్మాత. *సర్వ* : సర్వము తానే, తాను కనిపించకుండా జగనిర్మాణము, జగత్పరిణామము చేస్తూ, లయందాకా తీసుకొని వెళ్లే మహాతల్లి. సర్వ అనుటచేత సగుణ -నిర్గుణ బ్రహ్మము,. సర్వము తానే అని అర్ధము. అరుణ అనుటచేత నామరూపాధికము సర్వము తానే. అరుణప్రభలే మాతృతత్వసిద్ధి సూచికలు. ప్రేమేయరుపా త్రిపుర సుందరి. అమ్మవారి ఉపాస్యరూపము సర్వరుణము. సర్వరుణ బిందువే కామాక్షి కామదాయిని. కామసేవితగా పిలవబడుతుంది. అంతయు ఎఱుపుమయముగా వుండేది అని అర్ధం. ఆ తల్లి శరీర వర్ణము ఎఱుపు. ఆమె ధరించిన కిరీటములోని మాణిక్యములు ఎఱుపు. ఆమె సర్వము అరుణాస్వరూపముగా వుంటుంది అని సామాన్య అర్ధం. ఆ తల్లికి నమస్కారము 🙏 🌺ఏఱుపు రంగు ఉత్సాహానికి, ఉతేజానికి ప్రతిరూపం. మనలోని గ్రహింపు, చైతన్యం మననుంచి అటువంటి ఉతేజాపూరితమైన కాంతులను వెదజల్లుతాయి. 🌺 |