శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
2. శ్రీమహారాజ్ఞీ | ||
శ్రీమహారాజ్ఞీ నామంలో ఆరు నామములు దాగి వున్నాయి .రాజ్ఞీ , మహారాజ్ఞీ శ్రీహరి శ్రీరామ రామశ్రీ అన్న నామముల యుక్కా కదంబమే శ్రీమహారాజ్ఞీ అన్న ఒక్క నామం . అందులో మొదటి నామం రాజ్ఞీ . అంటే కాంతి పుంజము అని అర్ధం . ఆ కాంతి పుంజమే నాద పుంజమై సర్వకాశములను సృటించి , సృష్టికి ప్రాదుర్భావ హేతువైనది . దానికంతటికి తాను అధిష్టాత్రి కనుక ఆమె రాజ్ఞీ . ఆమె కంటే పైన ఎవ్వరు లేరు కనుక , నిరీశ్వరి కనుక ఆమె మహా రాజ్ఞీ . 84 లక్షల జీవరాసులన్నిటికీ ప్రాణము , శ్వాసగా చైతన్యముగా , జ్ఞానముగా , అజ్ఞానముగా తానే సమస్త సృష్టి యుక్కా పరిపాలనం చేస్తూవున్నది కాబట్టి ఆమె మహారాజ్ఞీ . శ్రీమహారాజ్ఞీ లో 'శ్రీ ' షోడశి . మహాసామ్రాజ్యానికి అధిష్టాత్రి , పట్టమహిషి . ఆ కారణం చేత ఆమె శ్రీమహారాజ్ఞీ . సమస్త లోకాలను పాలించే తల్లి కి నమస్కారము 🙏 🌺 *ఈ నామం* *పారాయణం వల్ల మనలో కలిగే మానసిక పరివర్తనం* 🌺 నిర్ధేశింపబడిన పద్దతులను , ధర్మాలను నియమంతో నిష్టగా పాటించి మన జీవితాన్ని మనము సక్రమంగా పాలించుకోగల దక్షతను కోరుకొని పొందుతాము . మన జీవన సామ్రాజ్యానికి మనమే అధికారులము అనే గ్రహింపు కలిగి తగిన జాగ్రత్తలు , క్రమశిక్షణ , ధర్మాధర్మములను తెలుసుకోగల వివేకం కలుగుతుంది . |