శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
33. కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్తనీ | ||
సృష్టియుక్క సంకల్పము చేసిన ఈశ్వరునకు *కామేశ్వర* అని పేరు. ఆయన సంకల్పమే సృష్టియుక్క గుర్తు. దాని రత్నము రత్నబిందువువైన మహామాయాస్వరూపము, ఆయనా ప్రేమ కి గుర్తుగా ఆ జగన్మాత, అందుకనే *ప్రేమరత్న* అన్నారు. సమస్త జగత్తు యందు వ్యాపించి వున్నది ఆ తల్లి. సమస్త సారస్వతములకు ఆమెయే తల్లి కాబట్టి, ఈశ్వరరునకు *రత్నమణి* ఐనది. మనలో వచ్చే ఉతేజములు కూడా ఆ మహామాయాస్వరూపమే. కామేశ్వరరూప సదాశివునిచేత జపించ బడిన బాలామంత్ర విశేషమేన "ఐం క్లిo సౌ: " బీజరత్నములే " కామేశ్వర ప్రేమ రత్నమణి. హృదయంలో అవి రగిలితే అమృతత్వము. అదే *ప్రతిపణస్తనీ* అన్నమాట. స్థనప్రదేశము అనాహతమైతే పంచదశీ మంత్రములోని మూడు కూటములలోనుండి ఒక్కొక్క బీజము సారాంశముగా తీసి సదాశివుడే ఈ మంత్రాన్ని జపించినాడు. అదియే కామేశ్వర ప్రేమ రత్నమణి. పరమేశ్వరుని ప్రేమ అనే రత్నామణికి ప్రతిమూల్య స్తనయుగ్మము కలది ఆ తల్లి అని సామాన్య అర్ధం🙏 🌺 *ఈ *నామంలో మనం* *తెలుసుకోవలసిన విషయం* 🌺 అమ్మవారి స్థనాలను భక్తి, జ్ఞాన అని భావించి ఆమె కృప కు పాత్రులము కాగలము. 🙏 |