*గేయచక్ర* : శ్రీచక్రాన్నీ గేయచక్రరధము అని అంటారు.
అమ్మవారియుక్క రధము గేయచక్ర రధము.
ఈ రథానికి ఒక చక్రం మంత్రిణి అనే రాజశ్యామలచే నిర్ధేశించబడుతుంది. ఆమెయే శ్యామలాదేవి.
శ్రీచక్రములోని అంతర త్రికోణమే గేయచక్రము. చక్రేశ్వరి అక్కడ త్రిపురాదేవి. ఆమెయే మంత్రిణి, అంటే మంత్రస్వరూపిణి, నాదస్వరూపిణి. ఆత్మసాక్షాత్కార బుద్ధియే మంత్రిణి.
1)సంగీత యోగిని, 2)శ్యామ, 3)శ్యామల, 4)మంత్రనాయిక, 5)మంత్రిణి, 6)సచివేశాని, 7)ప్రదానేశి,8) కుశ, 9)వీణావతి, 10)వైణికి,11) ముద్రిణి, 12)ప్రియక ప్రియ,13)నిపప్రియ, 14)కదంబవేశ్య, 15)కదంబ వనవాసిని, 16)సదామల.
ఈ పదునారుగురు పరమేశ్వరి దగ్గర మంత్రిణి పదమును అలంకరించి వుంటారు.
గేయచక్రమనే రధాన్ని అధిరోహించిన శ్యామలాదేవి అనే మంత్రిణి చేత సేవింపబడుతున్న అ తల్లికి నమస్కారము 🙏
🌺అ శ్యామలా దేవి మన బుద్దిని చైతన్యవంతం చేసి, మన ఆలోచన శక్తిని, జ్ఞానాన్ని పెంచుతుంది 🌺🙏
|