*నందితా* : నందితా అన్న ఆనందితా అన్న రెండు ఒకటే. అంటే తన లీనవిలాసాలను చూచి ఆనందించే తల్లీ. అటులనే దుఃఖము కూడా ఆమె చిరునవ్వుతో దాటేస్తుంది.
ఈ రహస్యాన్ని తెలుసుకుంటే, మనము దేవి భక్తులము అవుతాము. ఇంకా ఆ పరాత్పరికి దెగ్గర అవుతాము.
నామ పారాయణ ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆమె వుండి అదృష్యముగా, దృశ్యముగా, పరోక్షముగా ఆనందిస్తుంది. కాబట్టి నటేశ్వరి రూపములో ఈ నందివిద్యను అనగా పారాయణము, ఎవరు చేస్తూవుంటారో, ఏ ప్రదేశమునందు పారాయణం జరుతూవుంటుందో, ఆమె వచ్చి కూర్చొని ఆనందిస్తుంది.
*బాల* : బాల అంటే కుమారిక అని అర్ధం మాత్రమే కాదు.
బల సంబంధమైనది బాల. అహోబలస్వరూపిణి.
ఆ తల్లీ యుక్క బలము ఎంతటిది అంటే చిన్న బింధువు నుండి అనంతకోటి బ్రహ్మాండములను సృష్టించేటకు ఎంత బలము కావలెను. అదే అహూ పురుషికా స్వరూపము. కాబట్టి అమ్మవారు నారసింహీ.
అ నారసింహి నె మాయ.
కాబట్టి బాల అంటే బలములన్నిటికి తానే బలమైనది. అంతే కాదు ప్రాణములు అన్నిటికి ప్రాణమైనది. రూపములన్నిటికి తానే ఆదియైనది. నామమునకు, నాదమునకు ఆమె ఆదియైనది. ఇదంతా బల సముదాయమే.
*విక్రమా* : ఆమే పరాక్రమము. ఆమె సేన పేరే జయత్సేన. అంటే ఆమె ఎక్కడికి వెళితే అక్కడ గెలుపు తప్ప వేరే ఏమీ వుండదు. ఆమె జయలక్ష్మి సరస్వతి. ఆమె ఎక్కడకి వెళితే అక్కడ గెలుపు. ఆమెను తలచిన వారికీ కూడా గెలుపే.
*భండపుత్ర* : అంటే పంచతన్మాత్రులు, శబ్ద, స్పర్శ, రస, రూప, గంధములు. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు . అందుకనే భండపుత్ర ఐనది. భండా అంటే కర్మేంద్రియ, జ్ఞానేంద్రియములు,. పుత్ర అంటే వాటికి అనువుగా వచ్చే చెడు లక్షణాలు.
ఇప్పుడు భండపుత్ర వధ అంటే పంచతన్మాత్ర పరిజ్ఞాన రాహిత్యము. అట్టి వధకు వ్యూదుక్తమైనది బాల.
బాలాత్రిపుర సుందరి యుక్క బలపరాక్రమాన్ని చూసి సంతోసించే తల్లికి నమస్కారము🙏
🌺మనకి కొన్ని లక్షణాలు చిన్న తనము నుంచే వుంటాయి. ధర్మగా ఆలోచన చేయడం, ప్రేమ గా మాట్లాడటం., తనకి లేక పోయిన,..తన వస్తువు ఇంకొకరికి ఇవ్వడం లాంటివి మంచి లక్షణాలు. ఇవి మన మాతాపితరులు నించి వస్తాయి.
వయసు పెరిగే కొద్దీ, బాహ్య ప్రపంచాన్ని చూసి కొన్ని అవలక్షణాలు మనకి తెలియకుండానె మనతో పెరుగుతాయి.
అటువంటి అవలక్షణాలను పారద్రోలటానికి ఈ నామము ఎంతో సిద్ధిస్తుంది 🌺
|