శ్రీ చక్ర అంతర్గత బిందువే శ్రీమహాలక్ష్మి .
శ్రీ చక్ర అంతర్గత ఆంతర త్రికోణము నందున్న బిందువే వక్త్రలక్ష్మి .
'అగ్రబిందు పరికల్పితానాం ' అంటే ఈ వక్త్రలక్ష్మి నామముచేత కనుబొమ్మల తరువాత నేత్రములయుక్క వర్ణన చేస్తున్నారు .
ఈ నామంలో అమ్మవారియుక్క నేత్ర సౌందర్యాన్ని వర్ణించటం జరిగింది .
*లక్ష్మీపరీవాహ* : ఏ రకమైన సంపద అయినప్పటికిని అది ఒక వెలుగు. ఆ వెలుగే వైభవం .
అమ్మవారి యుక్క ద్రుష్టి పడటమే లక్ష్మి ద్రుష్టి , సరస్వతి ద్రుష్టి , బ్రాహ్మిదృష్టి .
లక్ష్మీపరీవాహము అంటే ఈ సమస్త అండా౦డ పిండాండ బ్రహ్మాండకోటి అంతయు ఆ తల్లియుక్క కృపా విక్షణ తేజాస్సు చేతనే ఏర్పడినది .
*చలన్మిన:* మీన అంటే చేప , అమ్మవారి కళ్ళు చేప వంటివి. ఆమె ముఖాన్ని ఇక్కడ సరోవరం తో పోల్చారు , నేత్రాన్ని చేపలతో పోల్చారు .
ఆమె నేత్ర సౌందర్యాన్ని వర్ణిస్తూ " *మీనాక్షి* " "మీనలోచని " అని పిలవబడుతుంది .
ఇక్కడ చల అంటే స్పంద శక్తి . సరోవరం లో వున్నా చేప స్పంద శక్తి ద్వారా ఎంత వేగంగా కదులుతుందో ,..తన నేత్రాలని కూడా అమ్మా అంతే వేగంగా తిప్పుతుంది .
కన్ను రెప్ప వేయకుండా సృష్టి లో వున్నా సర్వ జీవులను సంరక్షిస్తుంది . ఆ చూపు కోసమే మనందరమూ పరితపిచుపోవాలి 🙏
ఎలా ఐతే చేపగుడ్డు కేవలం తల్లిచేప కంటి చూపుతో పోషించబడుతుందో , ..
అమ్మ కూడా ఈ సృష్టి లో వున్నా తన పిల్లని తన కంటి చూపు తో రక్షిస్తుంది .
*భలొచన* : కాంతి .,అమ్మవారి నేత్రాలు కాంతి వంతమై, అగ్ని ,ఇంద్ర ,సూర్య ,తేజస్సు వలే ప్రకాసిస్తాయి .
ఆ కాంతివంతమైన చూపు తో ఆమె ఎక్కడ ఉన్నప్పటికీని తన శిష్యులు, తన భక్తులు , తనయందు విశ్వాసమున్న వారిని కాపాడి తీరుతుంది అని ఈ నామం లో వున్నా రహస్యము .
ముఖకాంతి యుక్క ప్రవాహంలో చలించే మీనముల జంటతో పోల్చదగిన కన్నులు గల తల్లికి నమస్కారము 🙏
🌺 *ఈ* *నామం వల్ల మనలో కలిగే** *మానసిక పరివర్తనము* 🌺
మనం ఎవరికైనా ఆదరణ , అప్యాయత చూపించడానికి /పొందడానికి కూడా వినియోగించేది కన్ను .
మనయుక్క చూపుతోనే ఎందరినో పోషించవచ్చు ఆకర్శించవచ్చు , దెగ్గరకు చేరవచ్చు .అంతటి గొప్ప ఇంద్రయాన్ని సద్వినియోగం చేసుకోగల తత్త్వం అలవడుతుంది 🙏
|