ఇందులోని గుప్త నామములు :
*జని* ** : జన్మ కలది జని. జన్మను ఇచ్చేది కూడా జనీయే. ఇతరులకు జన్మ కలగజేసేది అని అర్ధం. ఈశ్వరుడితో భిన్నము కానిది. ఇది నిజ. కాబట్టి జని లో నిజ, జని రెండు వున్నాయి.
*సత్* *లాపం - సల్లాపం* : అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం ఒక అర్ధం . మధుర పలుకులు.
వొకరిని ఒకరు విడవకుండా సృష్టి చెయటం. ప్రపంచోల్లాసమనేది వారి లీలా విలాసం.
కాబట్టి వారికి ఆ సంకల్పం కలిగినప్పుడు అయన సంకల్పము వేరు, అయినా వేరు అన్నట్లు ఇద్దరు వేరు అవుతారు. ఆ సంకల్పమే రక్తబిందువు అవుతుంది అదే శక్తీ అవుతుంది. అంతకముందు ఈశ్వరునకు శక్తీ లేదు..
ఈ సంకల్పమే అమ్మవారు, సత్ లాపము, సల్లా పము.
*సరిగమపదని* : ఇక్కడ అత్యంత రమణీయమైన రహస్యం ఏమిటి అంటే ఈ నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత్ లో స రి గ మ ప ద ని అన్న సప్త స్వరములఉన్నాయి. సల్లాపలో 'స ' వినిర్భర్సిత లో ని రి క గ కి. మధుర్యాం లో మ, ద వున్నవి. సరిగమపదని అన్న 7 స్వరములు, ఐదు ఇందు గర్భితులై వున్నవి.
రత్నములు సముద్రమంలోనించి బయటకు తేవాలంటే మునిగితేగాని రావు. అలాగే,.. ఈ అక్షరముల ఎందు సరిగమపదని అన్నవి వున్నవి.
అవే సప్త స్వరములు, సప్త వర్ణములు, సప్త ధాతువులు, సప్త నామములు, అవియే సప్త నాదములు అయినవి.
*కచ్ఛపి* : కచ్ఛపి అంటే వీణ. సరస్వతి వీణ. కచ్ఛపి అంటే సమస్త నాద ప్రపంచమునకు ప్రతిస్పంద రూపసము అని అర్ధం.
అమ్మవారు నాద స్వరూపిణి అయితే మనలో వున్నా వాణ్ణి స్వరములు ఆమె యుక్క స్వరమునకు ప్రతిస్పందములు.
మనము నిజంగా దివ్యమైన అనుభూతిని పొందితే మన స్వరం తప్పకుండ మారుతుంది. మనస్సు గద్గదమైనపుడు మన స్వరం మారిపోతుంది. .కాబట్టి కచ్ఛపి అంటే అమ్మవారి యుక్క నాద స్పందము మనయందు ప్రతిస్పందితమై మరల అది నాదముగా అమ్మవారినే చేరుతుంది.
లలిత పరమేశ్వరి యుక్క స్వరం చాలా రమణీయంగా, మధురము గా ఉంటుంది. ఈ నామం లో వున్నా అర్ధం ఏమి అనగా,.. లలిత పరమేశ్వరి నాద స్వరం ఎంత మధురంగా ఉన్నదంటే సరస్వతి దేవి యుక్క వీణ నాదాన్ని మించినట్లుగా వున్నది అని అర్ధం.
సరస్వతి యుక్క కచ్ఛపి వీణా మాధుర్యాన్ని కూడా మించినటువంటి మధురమైన సల్లాపాలు (పలుకులు ) గల తల్లికి నమస్కారము 🙏.
🌺 *ఈ* *నామం వల్ల మనలో కిలిగే* *మానసిక పరివర్తనము.* 🌺
చక్కటి స్వరంతో మాట్లాడగలిగే సంయమనం, సమర్థత, నేర్పు కలుగుతాయి. మృదువైన కంఠస్వరంతో అమ్మ యుక్క లీలలును స్మరించి గాత్రం ద్వారా అమ్మకి దగ్గర అవ్వగలుగుతాము. 🙏
|