శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
99. మూలాధారైక నిలయా | ||
*లయ* : బిందు, స్పంద, ప్రతిస్పందములే లయ. ఉచ్వాస -నిశ్వాసములే లయ. అమ్మవారు లయ స్వరూపిణి. ఈ సృష్టిలో వున్న ప్రతి అణువునందు వున్న లయలన్నిటినీ మళ్లీ తనయందె కలుపుకుంటే అది ప్రళయము. *నిలయ* : ఆమె లేని చోటు ఎక్కడ వున్నదని భావన చేసి, అర్చన చేస్తే అన్నిచోట్లా ఆమెనే వున్నది. కాబట్టి నిలయ. *ఏకనిలయ* : శ్రీమన్నాగరనాయిక ఆమె యుక్క ఏకనిలయం. లలితపరాంబికగా ఆమె వున్నపుడు పంచప్రేతామంచాధి శాయినియై వున్న తల్లిని ఎకనిలయా అంటారు. *ఆధారమూల* : అంటే అధిష్ఠానము. జగత్తే ఆమెకి అధిష్ఠానము. శ్రీచక్రాంతర త్రికోణమే మూలము లేక మూలప్రకృతి. దానికి ఆధారమ బిందువు. ఆ బిందువే ఏకనిలయము. అనగా బిందు స్వరూపిణి. శ్రీచక్రములోని మిగిలిన ఆవరణలన్నియు ఆ జగన్మాత యుక్క అనేకతా నిలయములు. మూల అన్నది కోణము. మూలాధారము అంటే మూలత్రికోణము. ఆ మూలత్రికోణ బింధువు ని ధ్యానం చేస్తే, అక్కడ నివాసము వున్న తల్లి కనిపిస్తుంది. ఆ తల్లికి నమస్కారము 🙏 🌺ఈ ధ్యానం అన్న ప్రక్రియ ని, ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి, ముందుగా ధ్యానం లో పరాశక్తి దర్శనం అన్న కోరిక కలగాలి. మనలో బాహ్యశుద్ది, అంతః శుద్ధి జరగాలి. అప్పుడే మనకి ఆ ఉన్నతమైన స్థితి కి వెళ్ళటానికి మనస్సు సిద్ధపడుతుంది. ఈ మార్పు మనలో రావాలి అంటే అది ఒక లలితా సహస్ర నామ జపం వల్లనే సాధ్యం.🌺 |