*నిత్యా* : నిత్యా అంటే పంచదశీ రూపముగా వున్న పదిహేను తిధులకు వున్న పేర్లలో నిత్య అన్నపేరు కూడా ఒకటి.
శ్రీచక్రములో నిత్యమండపములో పదునాల్గు మహా నిత్యలు వుంటారు.
1)కామేశ్వరి, 2)భగమాలిని, 3)నిత్యక్లిన్నా, 4)భేరుండ, 5) వహ్నివాసిని, 6)మహావజ్రేశ్వరి, 7)శివదూతీ, 8)త్వరిత, 9)కులసుందరి, 10)నిత్య, 11)నిలపతాక, 12)విజయ, 13)సర్వమంగళ, 14)జ్వాలామాలిని.
వీరు మన తిధి దేవతలుగా పూజిన్చబడుతారు. పౌర్ణిమ/అమావాస్య తిధి రోజు సాక్షాత్ సచిదాననస్వరూపిణి జగన్మాత ను పూజిస్తారు. శుక్లపక్ష తిధి పాడ్యమి నుంచి పౌర్ణిమ, మరల వీరే,..
కృష్ణపక్ష తిధి పాడ్యమి నుంచి అమావాస్య.
*పరానిత్య* : మహా మాయా స్వరూపిణి, లలితా పరంజ్యోతి. తానే పరానిత్య.
*ఈక్షణ* : అనగా చూపు. ఈశ్వరునియుక్క ఈక్షణమే మాయ ను పుట్టించింది. ఇక్కడ ఈక్షణం అంటే కాలస్వరూపము. మాయయే కాలస్వరూపము. పరానిత్య అని అర్ధము.
*సముత్సుకా* : ఆమె ఏప్పుడు కూడా అలసటనెరుగని పరిశ్రమ చేసే జగత్ జనని.
చిన్న ఇంటిని చక్క పెట్టొకొవటానికి చేతకాని మనము అలసటపొందువుంటాము. పదునాల్గు లోకములను సృష్టించి, అన్నిటా తాను వుండి, తాను లేను అన్న భ్రమను కల్పించి ఒక లీలగా పాలన చేస్తుంది, ఆమె సముత్సుకా.
తిధి దేవతలైన నిత్యదేవతల పరాక్రమాన్ని చూడడంలో ఉత్సాహాన్ని కలిగి వున్న తల్లికి నమస్కారము🙏
🌺ప్రతి నిత్యం అమ్మవారి పూజ చేసే ఆలోచన, గ్రహాలనుండి అనుకూలత కలుగుతుంది. 🌺
|