శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
40. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా | ||
*మాణిక్య* : మాణిక్యము అనగానే అంతరార్ధము స్వీకరించవలెను. దేవియుక్క సర్వోపాసనా రూపము. మాణిక్యం అనేది నవమణులలో ఒకటి. ఆ మాణిక్యము ఎఱుపు, నీలము కలిసిన రంగులో వుంటుంది. *మాణిక్యముకుట* : ఉపాసనాదేవియైన శ్రీమహాత్రిపురసుందరియుక్క కిరీటము, ఆమె ధరించిన వస్త్రములన్నియు మాణిక్యస్థగితములుగా ఎర్రని రంగులో ఉంటాయి. *ముకుటకారము* : ముకుటము అంటే శీర్షాయమానము, శీర్షాలంకారము, కిరీటము ఇద్యాది అర్ధములు. ఇక్కడ కిరీటమని అర్ధము కాకుండా, అమ్మవారు మెరుప్రస్తారము , శ్రీచక్రము చక్కగా కిరీటమువలె కనిపిస్తుంది. కాబట్టి ముకుటా కారము అంటే మెరుప్రస్తార శ్రీచక్రమునందు బిందు స్థానమును అలంకరించి శిఖరాగ్రమున కూర్చున్న తల్లి అని అర్ధము. *అనుద్వయం* : శుక్ల రక్తబిందువులు ఒకటిని విడిచి ఒకటి వుండవు. ఒకదాన్ని పక్కన ఒకటి విడవకుండా ఉండడమే అనుద్వయము. *విరాజిత* : హృదయస్థానములో వున్న అనుదీపమనే ఆత్మ ను అమ్మవారుగా భావిస్తే అదే విరాజిత. విరాజిత శబ్దము చేత శ్వేత సహస్రారము తెలుస్తుంది. అది చాలా వెలుగైనది. ఆ వెలుగు ఎపుడు స్వేతంగానే వుంటుంది. మంచి వెలుగు వస్తే అది తెల్లగా వుంటుంది. మధ్యరకం వెలుగు వస్తే అది ఎరుపు, పసుపు, తెలుపు కలిపినట్టుగా వుంటుంది. ఈ రెండు ఎప్పుడు అనుద్వయం. వొకటినొకటి అనుసరించి ఉండేవి అని అర్ధము. ఇది ఈ మంత్రం లో వున్న అంతరార్ధం. సామాన్య అర్ధము, మాణిక్య కిరీటమువలె వున్న జానుద్వయముతో (మోకాలు చిప్పలు)విరాజిల్లే, ఆ తల్లికి నమస్కారము 🙏 🌺ఈ *నామం వల్ల మనలో కలిగే* *మానసిక పరివర్తనము*🌺 మన భౌతిక శరీరంలో ముఖ్యమైన భాగం మోకాళ్లు. ఈ నామ జపం తో మనలో ఆత్మ విశ్వాసం పెరిగి, మోకాళ్ళ నొప్పులు అన్నవి తగ్గి, భాద నించి ఉపశమనము కలిగుతుంది. ఏ నామముమైన పరమ భక్తి శ్రద్ధలతో, అమ్మె యెందు విశ్వాసముతో జపం చేస్తే, తప్పకుండ ఫలిస్తుంది. 🙏 |