కులాటవి, అకులాటవి అని రెండు వుంటాయి. భూతచక్రాలైన మూలాధారాది ఆజ్ఞ్యపర్యంతం వున్నది కులసంకేతము. దానిని పాలించేది.
*కుల సంపాలిని :* కులమార్గమును చక్కగా పరిపాలించేది అని. నామరూపాత్మక ప్రపంచములో సంకల్పరూపిణియై, సర్వాంతర్యామినియై, మహామాయాస్వరూపిణియై వున్నది అ జగజ్జనని.
*నికేతన* : సమస్త నామరూపాత్మక జగత్తు ఆ తల్లియుక్క నికేతనము. అందుచేత ఆమె భవాని, భువనేశ్వరి. పద్మాటవీయే కులసంకేతము.
అనగా భూతచక్ర సముదాయము. కులము - పద్మాటవీ, ఆకులము - మహాపద్మాటవీ, సహస్రారము -మహాపద్మము. చక్రపరిజ్ఞానమే శ్రీవిద్య. అదియే మనలోని యోగవిద్య. శివశక్తి త్రికోణములే కులాకులములు. వాటి సమరస సమలీన భావమే కులసంకేతము.
ఆ సంకేతమునకు పాలిని అంటే బిందువు. అనగా, బిందుమండలవాసినియైన శ్రీ లలితయే కులసంకేతపాలిని. ఆ తల్లికి నమస్కారము 🙏
🌺మనపెద్దలు, మహర్షులు, గురువులు, బోధించిన ధర్మాలను విధానాలను, గౌరవించే తత్త్వం కలిగుతుంది.
విద్యను అభ్యసించడం ఒక స్థాయి, దానిని జీవితానికి అనుసంధానము చేయడం మరొక స్థాయి. మనము మన పూర్వీకులకు గౌరవం, మర్యాద, వారు బోధించిన నీతులులకు విలువలను ఇస్తేనే , మన తరవాత తరమువారు, మన భావాలను గౌరవిస్తారు అన్న విజ్ఞత కలుగుతుంది. 🌺
|