శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
93. కులాంతస్థా | ||
"మూలాది బిలపర్యంతం మహాత్రిపురసుందరరీం యాధనుష్టే తటిత్ప్రఖ్యాతం భజే భావనాశినీ " మూలాది అంటే మూలాధారం మొదలు, బిలపర్యంతం అంటే బ్రహ్మబిల పర్యంతం వున్న ముఖ్య ప్రాణస్వరూపిణియగు మహాత్రిపురసుందరియె కులాంతస్థా. అంటే కుల శాస్త్రములో సారభూతమై తెలియదగినది ఆ తల్లీ అని అర్ధం. ఆ తల్లికి నమసకారం 🙏 🌺మనజాతికి, విధానాలకు, వంశగౌరవానికి భంగం వాటిల్లకుండా, వాటిని ఆచరిస్తూ, అందరికి తెలియజేస్తూ ఒక ఉన్నతస్థాయిని పొందుతాము🌺 |