ఇందులో ని గుప్తనామములు
1. *మంత్రసాయికా* : మాత్రా సాయికములు అంటే నాద శరములు , అక్షరములు , అక్షర బాణములు .
2. *తన్మాత్రసాయిక* : అంతరేంద్రియ , బహిరే౦ద్రియములు అంటే జ్ఞన , కర్మేంద్రియములు పరస్పర సంయోగము చేత పొందే అనుభూతి .
శబ్ద , స్పర్శ , రూప , రస గంధములుగా భావితమైతే మరల మనస్సు దానిని స్వీకరించి దు:ఖమని కొన్నింటిని , సుఖమని కొన్నింటిని , ఆనందమని కొన్నింటిగా భావించడమే తన్మాత్ర స్వరూపము
కాబట్టి తన్మాత్రసాయిక అంటే అనుభూతియే బాణముగా జీవులను వ్యధపెట్టే మహామాయా స్వరూపిణి అని అర్ధం. ఒకప్పడు ఆనందము ఆలస్యమైనా భాదే కలుగుతుంది . ఆనందము అంతరధానమైతే అప్పుడు దు:ఖమే కలుగుతుంది .ఆనందం క్షణికం , త్రుటికం .ఆ తరువాత మరలా మామూలు జీవితం .
ఈ రీతిగా తన్మాత్ర సాయిక అంటే మన అనుభూతులనే బాణములతో మననే వ్యధకు , భాదకు , ఆనందానికి , ద్వందానికి గురిచేసి తను మహామాయా స్వరూపంతో 84 లక్షల జీవకోట్లయుక్క జీవిత విధిని నిర్వహిస్తూ ఆ తల్లి సమస్త జగత్తును పరిపాలన చేస్తున్నది .
3. *సాయిక :* అంటే బాణము . లక్ష్యము ఎక్కడ వున్నదో దానికి వెళ్లి తగలటం బాణము యుక్కా లక్షణం . ఇక్కడ సాధకుని లక్ష్యం లేదా గమ్యం బ్రహ్మప్రదార్థం . దానిలో లయం పొందడానికి అతడు చేసే ప్రయత్నం సాధన . దాని యుక్కా అభావ ఏకాగ్రతయే ధ్యానము .
ఈ రీతిగా సాయిక అంటే ఆ తల్లి మనలను అంతర్ముఖులుగా చేయటానికి తోడ్పడుతుంది . బహిర్ముఖులుగా చేయటానికి కూడా తోడ్పడుతుంది .
దృఢసంకల్పం కలిగివుంటే దానిని ద్రుడాతి దృఢంగా చేస్తుంది. చాపల్యం దానికి పట్టిస్తే చాపల్యతి చాపల్యా౦గా మన జీవితాలతో ఆడుకుంటుంది .
మరల సంకల్పం రూపంము ఆ తల్లియే .,..
కాబట్టి ఆమె లీల విలాసాలను నిర్వచించగలిగినవారు ఎవ్వరు పృథ్విలో లేరు. దాన్ని ఎలా ఎందుకు చేసావు అని అడిగలిగినవారు ఎవ్వరు లేరు.
ఆ విధిని అనుభవించటం మినహా మానవులను శక్తి వేరే లేదు. ఆ శక్తినివ్వమని మరల ఆ తల్లినే ప్రార్ధన చేయవలసి వుంటుంది 🙏.
4. *పంచసాయక* : ఐదు రకములైన పువ్వులతో అమ్మవారి బాణములు వుంటాయని అలంకారప్రాయంగా చెప్పిన అమ్మవారు బిందు స్వరూపిణియే పంచముఖములుతో తన గమ్యంమైన జగత్ సృష్టికి పునాదులు వేసింది .
అందులో సృష్టి , స్థితి , లయ , తిరోధాన వమనములనే ఐదు సృష్టియుక్క పరివర్తనాశీలమైన లక్షణములు .
దానినే పరిణామం జగత్ అంటాము . ఈ పంచకృత్యములే ఆమెయుక్క బాణములని భావించవలె
.
5. *తత్ర - అత్ర -యత్ర* : తత్ర అంటే అచట , అత్ర అంటే ఇచట, యత్ర అంటే ఎచట . ఎక్కడైనా సరే అమ్మవారు తేజస్సు లేని చోటు లేదు. "' ఇందుకల డందులేడను సందేహము వలదు. " అని భాగవతం లో పోతన గారు చూపినట్లు , విశ్వాసం కలవారికి ఆ తల్లియుక్క తేజస్సు సర్వవ్యాప్తమై కనిపిస్తుంది .
ఇచట , అచట ఎచట అనే భావన లేకుండా సర్వోపగతుండు ఎక్కడ అనుకుంటే అక్కడ వున్నాడు అన్నట్లుగానే , అమ్మవారే విష్ణు స్వరూపిణి , వ్యాపనశీలమైన లక్షణం తీసుకున్నప్పుడు విష్ణువనే తన అంశను అక్కడపెట్టి పాలనా చేస్తుంది.
సృష్టి అనే అంశాన్ని తెసుకున్నప్పుడు బ్రహ్మ అన్న తన అంశాన్ని అక్కడ పెట్టి ఆయనచేత చేయిస్తున్నది .
లయమనే ప్రళయకాలము తీసుకురావలసి వచ్చినప్పుడు తన అంశే అక్కడ శివుడై కూర్చున్నది .మరల వీరు ఒకరుగా ఉంటే కుదరదు కాబట్టి ,
బ్రహ్మకు సరస్వతిగా , విష్ణువుకు లక్ష్మీరూపంగా , శివునకు పార్వతిస్వరూపంగా వెళ్లి ఈ మూడు మిధునాలు తానే అయన మహాతల్లి ఈ లలితాపరమేశ్వరి .
సర్వము తానై వ్యాపించి వున్నది అమ్మ .
6. *పంచకాయ* : ఐదు రకముల శరీరం కలది . మనకు ముఖ్యంగా స్థూల శరీరం , సూక్మ శరీరం , కరణ శరీరం , మహాకారణ శరీరం , నిర్వాణ కాయం . ఇవీ అమ్మవారి పంచకాయములు .
అంటే పంచ స్వరూపములు .
సృష్టియుక్క పంచికరణం మళ్ళి ఐదుఇంటి చేతనే జరుగుతుంది . జగదధిష్ఠాత్రియైన లలితా పరమేశ్వరి పంచకృత్య పారాయణ అని పిలువబడుతున్న పంచకృత్యములు కూడా ఐదు సంఖ్యలోనే వున్నాయి .
ఈ శక్తియుక్క రూపముతో నామరూపములను సృష్టించదలుచుకున్నాదో అవి పంచభూతములు . పృద్వి ఆపస్ , తేజో , వాయు , ఆకాశములు , ఐదుగానే వున్నాయి . మనలోని వెళ్తున్న ప్రాణము శ్వాస కూడా ఐదుగానే విభజింపబడింది .ప్రాణ, అపాన్ , ఉదాన్, వ్యాన్ , సమానములు . మరల వాటియుక్క ఉపప్రాణములు కూడా ఐదు వున్నాయి . నాగ్, కుర్మా, కృకర , దేవదత్త , ధనుంజయములు. ఈ పంచ్ పంచ్ ఐదు ఐదు గా సృష్టినంతటిని చేసినది .
పంచ పంచ అన్న శ్రుతివాక్యముయుక్క సారాంశమే ఈ పంచతన్మాత్రసాయిక . ఆ తల్లికి నమస్కారము 🙏
🌺ఈ నామం పారాయణం వల్ల మనలో కలిగే మానసిక పరివర్తనం 🌺
ప్రపంచంలో సవ్యమైన ఉన్నతమైన జీవనం గడిపి , మనిషిగా కలిగిన జన్మకు సార్ధకత చేకూర్చుకోవడానికి కావలసిన జాగ్రత్తలు కట్టుబాట్లు పాటించగలుగుతాము . పంచేంద్రియాల ద్వారా పొందే ఫలితాలను సవ్యంగా ఉపయోగించుకునే మనస్సును , మాయలో పడి ప్రలోభాలకు లోబడకుండా ఉండగలిగే స్థిరత్వాన్ని సంపాదించుకుంటాము 🙏
|