*పంచ* : పంచ ఆకాశములు, పంచ భూతములు, పంచ ఇంద్రియములు, పంచ తన్మాత్రలు, పంచ కృత్యములు. సృష్టి, స్థితి, లయ, నిగ్రహ, అనుగ్రహ . ఐదు -ఐదు సంఖ్యగా ఈ సమస్త జగనిర్మాణమును చేసినది ఎవరొ ఆమె 'పంచ'.
*బ్రహ్మ* : సృష్టిని అభివృద్ధిచేయు లక్షణము కలది బ్రహ్మ. అందుచేతనే ఆమె బ్రహ్మణి.
*ఆసన* : అధిష్టానమే ఆసనము. అంటే ఈ సమస్త సృష్టియూ ఆమెకు అధిష్టానమే. మిధ్యజగదధిష్ఠాత్రి. సర్వజగత్తునూ తన సింహాసనముగా చేసుకొని కూర్చున్నది.
*పంచాననా* : హ్రీo శ్రీo ఐo క్లీo సౌ: ఇవి పంచబ్రహ్మ ప్రణవములు. ఐదు ముఖములుగా ఆమె సృష్టి చేస్తుంది.
అ పంచకృత్యములే సృష్టి, స్థితి, లయ, నిగ్రహ, అనుగ్రహ.
" శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం"
బ్రహ్మ -విష్ణు -రుద్ర -మహేశ్వరులు ఆసనానికి నాలుగు కోళ్లుగా కల సదాశివ పర్యంక సహితమైన ఆసనమే పంచబ్రహ్మాసనము.
పంచుత్రికొనములు శక్తివి, నాలుగు త్రికోణములు శివునివి. పంచత్రికోణములే అధిష్టాత్రి, నాలుగు త్రికోణములు మూలకారణములు.
నాలుగు త్రికోణము శివబిందువు. ఐదు త్రికోణములు శక్తిబిందువు. ఈ రెండిటి పరస్పరము చేత నవావరణ సమోపేతమైన శ్రీచక్రము అనే జగత్ చక్రము నిర్మాణమైనది.
పంచబ్రహములచే నిర్మించబడిన ఆసనంపైన విరాజిల్లు తల్లికి నమస్కారము 🙏
🌺మనము ఈ భూమి మీద పుట్టాము అది సృష్టి,(ఈసృష్టికి, (జన్మ) కారణం తెలుసుకోవాలి )
మనము ఈ భూమిమీద ఎన్నాళ్లు ఉంటాము అన్నది స్థితి, (life time )
మన ఈ శరీరము ఎన్ని బాధలను ఓర్చుకుంటుంది అన్నది నిగ్రహం, (కష్టాలు, సుఖాలు)
మనము చేసే సత్కర్మలు బట్టి మనము అనుగ్రహ పొందుతాము. (achievements)
ఆఖరుకు వృధాప్యము వచ్చి, మన జీవిత కాలాన్ని బట్టి మట్టిలో కలిసిపోతాము, లయమైపోతాము. (మోక్షం కోసం ప్రయత్నించాలి)
పునరపి జననం పునరపి మరణం
పునరపి జననం జట్టరే శయనం
ఇహ సంసారే బహు దుస్తారే, కృపయా పారె పాహి మురారే
భజ గోవిందం, భజగోవిందం "
ఈ జనన మరణం నించి విముక్తి కలిగించు అని వెడొకోవాలి 🌺🙏
|